Lokesh:అమిత్ షాను లోకేశ్ అందుకే కలిశారా..? ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah)ను బుధవారం రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) కలిసిన సంగతి తెలిసిందే. సీఐడీ విచారణ అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లిన లోకేశ్ అమిత్ షాను కలిశారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్ట్, తదనంతర పరిణామాలను షా దృష్టికి తీసుకెళ్లినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. సీఎం జగన్(Jagan) కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తమ కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై ఎన్ని కేసులు పెట్టారని షా అడిగినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయం తమకు తెలియదని.. ఏపీలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పినట్లు పేర్కొంటున్నారు.
ఇటు పురందేశ్వరి.. అటు కిషన్ రెడ్డి.. మధ్యలో లోకేశ్..
అమిత్ షాను లోకేశ్ కలిసిన సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆ సమావేశం తరువాత పురందేశ్వరి ట్వీట్ చేశారు. దీంతో బాబు అరెస్టుకు కేంద్ర పెద్దలకు ఏం సంబంధం లేదని ఆమె చెప్పినట్లు అర్థమవుతోంది. మరోవైపు టీడీపీ-జనసేన(TDP-Janasena) పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో బీజేపీ కూడా కలిసి రావాలని పవన్ కల్యాణ్ పదే పదే కోరుతున్నారు. ఇదే సమయంలో పురందేశ్వరితో కలిసి లోకేశ్ అమిత్ షాను కలవడంతో పొత్తుపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు.
పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని భావిస్తున్న కమలం నేతలు..
త్వరలోనే టీడీపీ-జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తామని బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు కమలం నేతలు భావిస్తున్నారు. ఇదే కనక నిజమైతే వైసీపీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టీడీపీ-జనసేనతో పోలిస్తే బీజేపీకి పెద్దగా ఓట్లు రాకపోయినా ఎన్నికల సమయంలో కేంద్రం మద్దతు ఉంటే వైసీపీని ధీటుగా ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అందుకే పవన్ కల్యాణ్ తమతో బీజేపీ కలిసి రావాలని కోరుతూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టుకు ముందు, తర్వాత అనేలా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments