ఏపీ సెక్రటేరియట్‌‌కు కత్తి మహేశ్ ఎందుకెళ్లినట్లు!?

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

టాలీవుడ్‌లో వివాదాలకు మారుపేరుగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఉన్నట్టుండి ఏపీ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యాడు. దీంతో సెక్రటేరియట్‌లోని ఉద్యోగులు ఈ కటౌట్‌ను ఎక్కడో చూశామే.. అన్నట్లుగా ఓ లుక్కిచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన కత్తి.. నేరుగా సెక్రటేరియట్‌కు వెళ్లాడు. అయితే కత్తి.. సెక్రటేరియట్‌ వెళ్లడానికి కారణాలున్నాయని తెలుస్తోంది.

పుస్తకావిష్కరణకేనా!

మంగళవారం నాడు ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సినారేకు సంబంధించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేయనున్నారు. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గోడ రఘురాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు కత్తి మహేశ్‌కు కూడా ఆహ్వానం వచ్చిందని.. అందుకే ఆయన అమరావతి వచ్చాడని తెలుస్తోంది. కాగా.. పుస్తకావిష్కరణలకు కత్తి ఎక్కువగా వెళ్తుంటాడు.

పెద్దిరెడ్డితో భేటీ అయ్యాడా..!

కత్తి మహేశ్ స్వగ్రామం చిత్తూరు జిల్లా యలమంద అన్న సంగతి తెలిసిందే. కాగా చిత్తూరు జిల్లా నుంచి ఇద్దర్ని వైఎస్ జగన్ తన కేబినెట్‌లో చోటిచ్చిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు వైసీపీ కీలకనేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీ రాజ్‌ శాఖ.. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలిచిన నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖ కట్టబెట్టారు. చిత్తూరు నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న పెద్దిరెడ్డి, నారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కత్తి సెక్రటేరియట్‌కు వెళ్లాడని సమాచారం. అయితే పెద్దిరెడ్డితో కత్తికి మంచి సంబంధాలున్నాయని చెప్పుకుంటూ ఉంటారు. సో.. కత్తి సెక్రటేరియట్‌కు ఎందుకెళ్లాడన్నది అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక కానీ.. మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. వైసీపీ మద్దతుగా టీడీపీ, జనసేన అధిపతులను మొదలుకుని నేతలపై సైతం తీవ్ర స్థాయిలో కత్తి విమర్శలు గుప్పించిన సందర్భాలు కోకొల్లలు.

More News

రోజా, అంబటి, ఆళ్లకు త్వరలో కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవులు ఆశించి.. చివరి నిమిషం వరకు పక్కా అనుకుని దక్కించుకోలేకపోయిన వారిలో రోజా, అంబటి రాంబాబు

జూన్ 28న విడుద‌ల‌వుతున్న‌ శ్రీవిష్ణు, నివేథా థామ‌స్ 'బ్రోచేవారెవ‌రురా'

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది.

అయ్యో.. రోజా కంటే ముందే ‘ఆమె’కు కీలక పదవి!?

అవును.. మీరు వింటున్నది నిజమే ‘ఆమె’కు కీలక పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్ ఫిక్స్ అయ్యారట.

ర‌జ‌నీ, క‌మ‌ల్‌పై స‌త్య‌రాజ్ ఫైర్‌

స‌త్య‌రాజ్‌.. ఒక‌ప్పుడు ఈ న‌టుడి గురించి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, బాహుబ‌లి, మిర్చి స‌హా ప‌లు తెలుగు చిత్రాల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుకు సుప‌రిచితుడిగా మారారు.

జగన్‌కు డిప్యూటీ సీఎంల సలహా ఇచ్చింది ఆయనేనా!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు..