K Viswanath: నాకు కళ్లు నెత్తికెక్కకూడదనే... విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు. వారు జనంపై, సమాజంపై వేసే ముద్ర అలాంటిది. అందుకే అంతటి ఫాలోయింగ్. తమ అభిమాన హీరో, హీరోయిన్, క్రీడాకారుడు, నాయకులను జనం బాగా అనుకరిస్తారు. షూ దగ్గరి నుంచి హెయిర్ స్టైల్ వరకు ఇలా ఆ పాదమస్తకం మక్కీకి మక్కీ దింపే వారు మన చుట్టూ కొకొల్లలు. సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. పరుచూరి గోపాలకృష్ణ ఎర్ర శాలువా, కోడి రామకృష్ణ నుదిటిపై రిబ్బన్ ఇలా చాలా మంది ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా పరమపదించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ విషయంలోనూ ఓ ప్రత్యేకత వుంది. అదేంటో చూస్తే:
ఎమ్మెల్యేకి సీఎం పదవి ఎలాగో.. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కుర్చీనే:
విశ్వనాథ్ దర్శకుడిగా సెట్లో వున్నప్పుడు ఖాకీ దుస్తులు ధరించేవారు. అప్పట్లో ఎంతోమంది నటీనటులు, సాంకేతిక బృందం సైతం ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాక జుట్టు పీక్కునేవారు. దీనికి ఓ ఇంటర్వ్యూలో రీజన్ చెప్పారు కే.విశ్వనాథ్. ఎమ్మెల్యే అయినవాడి చివరి మజిలీ సీఎం పదవి అయినట్లు.. తన టైంలో ఏ విభాగంలో అడుగుపెట్టినా అంతిమ గమ్యం డైరెక్టర్ కుర్చీనే అని తెలిపారు. సాధారణ సౌండ్ రికార్డిస్ట్ స్థాయి నుంచి దర్శకుడిగా ఎదిగిన తనకు కళ్లు నెత్తికెక్కే ప్రమాదం వుందని... అందుకే బూట్లు , షర్ట్, ఫ్యాంట్ , గొలుసు వంటివి వేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వనాథ్ వెల్లడించారు.
ఖాకీ డ్రెస్‌పై ఆర్ట్ డైరెక్టర్‌తో గొడవ:
తన సెట్లో పనిచేసే పెయింటర్స్, లైట్‌బాయ్స్, ఇతర అసిస్టెంట్స్ మాదిరిగానే తాను కూడా ఖాకీ దుస్తులు ధరించినట్లు విశ్వనాథ్ తెలిపారు. దీనిపై ఓసారి తన ఆర్ట్ డైరెక్టర్ తనతో గొడవ పడ్డాడని.. దీనికి తాను ‘‘ తొలి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవర్‌గా మారిపోతానని.. అలాగే కుట్టించుకోవడానికి కుదురుతుందో లేదోనని ముందే రెడీ చేసి పెట్టుకున్నా’ అని చెప్పినట్లు విశ్వనాథ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout