తెలంగాణకు అడ్డుపడ్డ వైసీపీకి కేసీఆర్ మద్దతా?
- IndiaGlitz, [Sunday,March 24 2019]
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వేలు పెట్టడంతో.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్.. వైసీపీకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు త్వరలోనే చంద్రబాబుకు తానురిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, వైఎస్ జగన్‌పై కన్నెర్రజేశారు. తెలంగాణ ద్రోహుల పార్టీ వైసీపీ అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ద్రోహి జగన్‌కు కేసీఆర్ వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అడ్డుపడ్డ ఏకైక పార్టీ వైసీపీ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ద్రోహులకే కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని.. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే టీడీపీ గెలవాలని కోరుకునేవాడిని అని కానీ పొత్తు లేదు కాబట్టే కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నానని జీవన్ రెడ్డి తన మనసులోని మాటను చెప్పారు.
ఇదెక్కడి ఎన్నికల నియమావళి..?
టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థి అభ్యర్థి కావాలని నాకు మద్ధతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూన్నాను. ఐటీఆర్ ప్రాజెక్ట్‌ను గతంలో యూపీఏ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగుల లక్ష్యంగా కృషి చేస్తే టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. తుమ్మడి ఎడ్డీ ఇతర ప్రోజెక్టలు జాతీయ హోదా వచ్చే దాన్ని మీ అసమర్ధతతో మీ చేతకాని తనంతో రాలేవు. తెలంగాణను ఆనాడైనా ఈ రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ గెలవబోయే ప్రతి సీటు ఎన్డీఏ ప్రభుత్వంలోకే వెళ్తుంది. షుగర్ ఫ్యాక్టరీ తెరువకా చెరుకును ఇక్కడి నుంచి గాయత్రీ ఫ్యాక్టరీలోతీసుకెళ్తున్నారు. పసుపు రైతులకు క్వింటాల్‌కు 2 వేల బోనస్ ఇవ్వండి. ఎన్నిక నియమావళి వచ్చిన తరువాత ఎస్సార్సీపీ అధికారులతో కవిత సమీక్ష సమావేశం నిర్వహిస్తూన్నారు. ఇదెక్కడి ఎన్నికల నియమావళి.. ఎన్నిక నామినేషన్ వేసిన తరువాత కవిత అధికారులతో రివ్యూ ఎలా చేస్తారు?. ప్రజా సంక్షేమం పట్ల టీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదు. ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టును మేము వస్తే జాతీయహోదా కల్పిస్తాం అని జీవన్ రెడ్డి తెలిపారు.
16 సీట్లతో ఏం చేస్తారు..?
ఇంతకు ముందు 15 స్థానాలు కలిగి ఉన్నా టీఆర్ఎస్ పార్టీ సాధించింది ఏమిటి?. ఇప్పుడు 16 సీట్లు వస్తే ఏదో సాధిస్తామాంటున్నారు. 16 సీట్లతో కేసీఆర్ ఎలా చక్రం తిప్పుతారు.? టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే టీఆర్‌ఎస్, వైసీపీలు బీజేపీకి మిత్రులు అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జీవన్ వ్యాఖ్యలపై త్వరలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కవిత, కేటీఆర్ స్పందించనున్నట్లు తెలుస్తోంది.