షర్మిల వస్తే సీఎం జగన్ ఎందుకు భయపడతారు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

  • IndiaGlitz, [Monday,January 01 2024]

ఆడలేక మద్దెల దరువు అన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. ఎన్నికల్లో సీఎం జగన్‌తో ఒంటరిగా పోరాడే సత్తా లేని పార్టీ కూడా అవాకులు చవాకులు పేలుతుంది. తన అనుకూల యెల్లో మీడియా ద్వారా సత్యదూరమైన వార్తలు రాయిస్తూ ఆనందపడుతోంది. తన సోదరి వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నట్లు ఊదరగొడుతోంది. అసలు భయమనేది జగన్ డిక్షనరిలోనే లేదు. అంతకుమించి లాలూచీ రాజకీయాలు తెలియవు. చంద్రబాబు మాత్రమే లాలూచీ రాజకీయాలు చేస్తారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం.. అవసరం తీరాక వారిపైనే బుదర జల్లడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.

సోనియాగాంధీకే భయపడని నేత..

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డింది. అప్పటి యూపీఏ హయాంలో బలమైన నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీ అండ్ కో బెదిరింపులనే లెక్క చేయలేదు. కేసులు పెట్టి వేధిస్తే ధైర్యంగా ఎదుర్కొన్నారు తప్ప పారిపోలేదు. సీబీఐ కేసులతో ఇబ్బందులు పెట్టాలని చూసినా ఏనాడు తలొగ్గలేదు. ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎంపీ పదవిగా రాజీనామా చేసి తన బలంతో వైసీపీ పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 2014లో ఓటమి ఎదురైనా.. పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కొన్నా వణకలేదు. అసెంబ్లీలో ఎన్నో అవమానాలకు గురిచేసినా కుంగిపోలేదు.

షర్మిల రాకతో జగన్‌కే ప్లస్..

అలాంటిది ఇప్పుడు షర్మిల వస్తే తనకు నష్టం కలుగుతుందంటూ ఎలా భయపడతారని పచ్చ పార్టీ అనుకుంటుందో తెలియడం లేదు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరి పోటీ చేసినా ఆమె చీల్చే ఓట్లు టీడీపీకే మైనస్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అంత ఎక్కువ ఓట్లు చీలుతాయి. ఇది కచ్చితంగా జగన్ ప్రభుత్వానికి లాభం చేకూర్చనుంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పోటీలే లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీ-జనసేన కూటమికే మల్లుతాయి కదా. ఈ చిన్న లాజిక్ తెలియని తెలుగుదేశం నేతలు జబ్బలు చర్చకుంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనతో పొత్తులో ఉంటూనే బీజేపీతోనూ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే భయంతో చంద్రబాబు వణికిపోతున్నారని అర్థమవుతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

More News

Earthquake in Japan: జపాన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు.. సునామీ హెచ్చరికలు..

కొత్త సంవత్సరం జపాన్‌(Japan)కు భీకరమైన జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది. వరుస భూకంపాల(Earthquake)తో ఆ దేశం ఉలిక్కిపడింది. 90 నిమిషాల వ్యవధిలో 21 భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Sharmila son: కుమారుడు పెళ్లి తేదిని ప్రకటించిన వైయస్ షర్మిల.. వధువు ఎవరంటే..?

తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్సార్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన కుటుంబానికి సంబంధించిన కీలక విషయాన్ని వైసీటీపీ అధినేత్రి వైయస్ షర్మిల వెల్లడించారు.

Biryani: లక్‌ అంటే ఇదే.. బిర్యానీ తిన్నాడు.. రూ.7లక్షల కారు గెలుచుకున్నాడు..

అదృష్టం అంటే ఇదే కదా. ఒక్క బిర్యానీ తింటే లక్షల రూపాయలు విలువ చేసే కారు గిఫ్ట్‌గా వచ్చింది. ఒక్కోసారి అదృష్ట దేవత అనుకోని విధంగా కొంతమందిని పలకరిస్తూ ఉంటుంది.

PSLV-C58 XPoSat: ఇస్రో న్యూ ఇయర్ గిఫ్ట్.. ఎక్స్‌పోశాట్ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందించింది. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. అగ్రరాజ్యం అమెరికా

మంత్రి రజినీ కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తల రాళ్ల దాడి..

కొత్త సంవత్సరంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. అర్థరాత్రి పూట గుంటూరులో వీరంగం సృష్టించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్‌, మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.