చంద్రబాబుకు ఎందుకంత భయం.. ఇంకా తేరుకోలేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేనట్లేనని తెలుస్తోంది. అయితే మరోవైపు అధికార పార్టీ నేతలు, మంత్రులు సూటిపోటి మాటలతో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ కీలక నేత, వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటన పార్టీ తరపున చేశారని.. పార్టీ వాగ్దానానికి, ప్రభుత్వ వాగ్దానానికి తేడా తెలియదా? అని ప్రశ్నించారు. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ఐదేళ్లలో రూ.11,400 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పుకొచ్చారు. మిగతా రుణాలు ఈ ప్రభుత్వం మాఫీ చేయాలనడం అవివేకమన్నారు.
అధికారపక్షంపై ఆరోపణలు చేయడం మానుకుని... ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమీ లేవని.. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సమీక్షిస్తామని ఎన్నికల సమయంలోనే జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఘోరపరాభవం నుంచి చంద్రబాబు ఇంకా తేరుకోలేదని.. ఏకపక్షంగా ఏ ప్రాజెక్టును నిలిపివేయలేదన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులేవీ లేవని.
తప్పులు జరగనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తొలి కేబినెట్ సమావేశం గొప్పగా జరిగిందని... మంత్రులు, అధికారులను సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments