జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్లంతా ఎందుకు రాలేదు!

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో విజయడంఖా మోగించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12:23 గంటలకు సరిగ్గా.. ‘వైఎస్ జగన్ అనే నేను..’ అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. కాగా ఆఖరి నిమిషంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాలేకపోయారు. ఎలాంటి ఆడంభరాలకు పోకుండా సింపుల్‌గా జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ముగించేశారని చెప్పుకోవచ్చు.

అన్నదమ్ములు రాలేదేం!

కాగా.. వాస్తవానికి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను జగన్ ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ముఖ్యులకు జగన్‌ నుంచి ఫోన్ వెళ్లడమేకాకుండా స్వయంగా ఆహ్వాన పత్రికలు సైతం అందజేయడం జరిగింది. అయితే టాలీవుడ్ నుంచి ఒక్కరంటే ఒక్కరూ రాకపోవడం గమనార్హం.

ఎందుకిలా జరిగింది..?

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడానికి టాలీవుడ్ నటీనటులు క్యూ కట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే వారెవ్వరూ జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కనపడకపోవడం గమనార్హం. అయితే వీరందరూ రాకపోవడానికి కారణాలేంటి..? అనేది ఆ పెరుమాళ్లకే ఎరుక. మొత్తమ్మీద థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, కృష్ణుడు, సుధాకర్ నాయుడు, అలీ.. అంతేకాదు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో వైసీపీ నేతలకు బాగా దగ్గరైన, వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ వచ్చారు.. కానీ అసలు వ్యక్తులు రాకపోవడం గమనార్హం. దీంతో అప్పుడంతా క్యూ కట్టారు కదా.. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ వాళ్లకు ఏమైందబ్బా..? అని సభికులంతా షాక్ అయ్యారు. అంతేకాదు.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎగబడి మరీ సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందిన చిన్న.. పెద్ద నటీనటులు శుభాకాంక్షలు వెల్లువలా చెప్పారు. కానీ అసలు ఘట్టం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మరిచిపోయారు.

నాగార్జున ఎందుకు రాలేదు..?

వైఎస్ కుటుంబంతో అక్కినేని కుటుంబానికి ఉండే అనుబంధమే వేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బతికున్నప్పటి నుంచి నేటి వరకూ నాగార్జున మంచి సంబంధాలు నెరుపుతున్నారు. అయితే జగన్ మేలుకునే వారిలో ఒకరైన నాగ్.. పాదయాత్ర గురించి.. ఎన్నికలు, టికెట్ గురించి మాట్లాడటం.. అసలు ఘట్టం, పదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిన రోజు నాగ్ సరిహద్దుల్లో లేకపోవడం గమనార్హం. దీనిపై అటు ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాల్లో పలు రకాలు చర్చించుకుంటున్నారు.

ఎందుకు వెళ్లలేదు..!?

ఇవన్నీ అటుంచితే ఇప్పటికే జనసేన తరఫున పోటీచేసిన పవన్, నాగబాబుల ఓటమికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులని వార్తలు వినవస్తున్నాయి. అంతేకాదు కొందరు ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడటం.. దానికి అవతలి వ్యక్తులు క్లారిటీ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అట్టర్ ప్లాప్ అవ్వడంతో తాము ఈ టైమ్‌లో అమరావతికి వెళ్లి ప్రమాణానికి వెళ్లడం సబబు కాదని కొందరు వెళ్లకపోగా... మరికొందరు మెగా ఫ్యామిలీకి బయటపడి పోలేదని వార్తలు వినవస్తున్నాయి. సో.. దీనిపై క్లారిటీ రావాలంటే ఎవరో ఒక్కరు మీడియా ముందుకొచ్చో.. లేకుంటే సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తే పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుంది.

More News

ఈద్‌కి 'సాహో' స్పెష‌ల్ గిఫ్ట్

ఈద్‌.. ముస్లిం సోద‌రులు ఘ‌నంగా చేసుకునే పండుగ‌. ఈ పండుగ‌కు ముస్లిం సోద‌రుల‌ను ఖుష్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు ప్ర‌భాస్‌.

ముగ్గురిలో.. క్రిష్ ఒక‌ర‌న్న‌మాట‌

ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు ద‌ర్శ‌కులు.. ఓ స్టార్ డైర‌క్ట‌ర్ సినిమా. ఇదీ ఈ మ‌ధ్య అంద‌రి నోళ్ల‌ల్లో నానుతున్న విష‌యం.

అద్గ‌ది... బంగార్రాజా మ‌జాకా

`సోగ్గాడే చిన్నినాయ‌నా` సినిమాను చూసిన వాళ్లంద‌రూ నాగార్జున అన్న త‌స్సాదియ్యా.. అద్గ‌దిగ‌ది అనే ప‌దాలు గుర్తుండే ఉంటాయి.

క్షమించండి.. ఫ్యాన్స్‌కు అల్లు శిరీష్ భావోద్వేగ లేఖ

అల్లు కుటుంబం నుంచి అబ్బాయి అల్లు శిరీష్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు చేయని ప్రయత్నాల్లేవ్. ఇప్పటికే పలు సినిమాలు చేసిన అల్లువారబ్బాయి.. పెద్దగా ఏమీ వర్కవుట్ అవ్వలేదు.

పాలన పై జగన్ పట్టు.. చంద్రబాబు టీమ్ ఔట్

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించేందుకు చర్యలు షురూ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే జగన్