చిరుకి అక్క‌డేం ప‌ని?

  • IndiaGlitz, [Monday,December 02 2019]

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో లేరు. బ్యాంకాక్ చేరుకున్నారు. ఆదివారం రాత్రే ఆయ‌న బ్యాంకాక్ బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం. అక్క‌డే 10-15 రోజుల పాటు ఉండ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు ఇప్పుడు మెగాస్టార్ బ్యాంకాక్ ఎందుకు వెళ్లిన‌ట్లు అని అనుకుంటే ఆయ‌న అక్క‌డే మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నార‌ని స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ బ్యాంకాక్‌లో జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే చిరు అక్క‌డికి వెళ్లార‌ని టాక్‌.

డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్‌. ఇన్నాళ్లు పామ్‌లో లేని మ‌ణిశ‌ర్మ 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో ఫామ్‌లోకి వ‌చ్చాడు. చిరంజీవి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం చేసిన మ‌ణిశ‌ర్మ, చిరంజీవి న‌టించిన ప‌లు చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మ‌ధ్య‌లో దేవిశ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ దూసుకు రావ‌డంతో పాటు మ‌ణిశ‌ర్మ క‌నుమ‌రుగ‌య్యాడు. ఇంత‌కు ముందు ఈ చిత్రానికి అజ‌య్ అతుల్ పేర్లు సంగీత ద‌ర్శ‌కులుగా పేర్లు విన‌ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు వారిద్ద‌రూ నో చెప్పిసిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ 'సైరా న‌రసింహారెడ్డి' విడుద‌లై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అంత‌కు ముందు చిరంజీవి 'ఖైదీ నంబ‌ర్ 150' సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను సాధించాడు. ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌.

More News

'క్వీన్‌' టీజ‌ర్ వ‌చ్చేసింది.. 

మాహిష్మతి రాజమాత శివగామిగా అలరించాలన్నా, కంటి చూపుతో బెదిరించే శైలజారెడ్డిగా మెప్పించాలన్నా అది రమ్యకృష్ణకే సాధ్యైమెంది.

'నిశ్శ‌బ్దం' రిలీజ్ డేట్

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

టాలీవుడ్ హీరోలకు పవన్ వార్నింగ్!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టాలీవుడ్ హీరోలకు వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న ఆయన..

పార్లమెంట్‌లో ఏ నోట విన్నా ‘దిశ’.. కేంద్రం కీలక ప్రకటన

హైదరాబాద్‌‌లోని శంషాబాద్‌లో చోటుచేసుకున్న ‘దిశ’ హత్య ఉదంతంపై ఇవాళ పార్లమెంట్‌లో పెద్ద చర్చే జరిగింది.

‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకోవడం’ - జగన్‌

‘నా మతం మానవత్వం.. కులం మాట నిలబెట్టుకోవడమే’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.