‘సైరా’ను చిరంజీవే ఎందుకు చేశారు..!?
- IndiaGlitz, [Saturday,September 28 2019]
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్- 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న సందర్భంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లోనూ ఇంటర్వ్యూలు ఇస్తూ చిరు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.
తాజాగా ముంబాయ్ వెళ్లిన చిరు, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ను.. నటుడు ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చిరు, అమితాబ్ పంచుకున్నారు.
- అసలు ‘సైరా’లో మీరే ఎందుకు చేశారు..? మీరు చేయడానికి కారణాలేంటనే ప్రశ్నకు చిరు చాలా లాజిక్‌గా సమాధానమిచ్చారు.
చిరు సమాధానం: స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో నటించాలన్నది తన కల అని..తనకు భగత్ సింగ్ అంటే ఎంతో ఇష్టమన్నారు. కానీ ఆయన బయోపిక్ తీద్దామని.. కథ రాసుకుని తన దగ్గరికి ఎవరూ రాలేదని.. రాజకీయాల్లోకి రాక మునుపు ‘సైరా నర్సింహారెడ్డి’ కథతో పరుచూరి బ్రదర్స్ తన దగ్గరికొచ్చారని.. వారు చెప్పిన కథ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అంతా ఓకే గానీ ఆ టైమ్‌లో సినిమాకు నిర్మించే వాళ్లు ఎవరూ దొరకలేదన్నారు. అలా రాజకీయాల్లో తప్పుకున్నాక.. తాను నటించిన 150, 151.. ఖైదీ నంబర్-150, సైరా రెండు సినిమాలను చరణే నిర్మిస్తానని ముందుకొచ్చాడని చిరు చెప్పుకొచ్చారు.
కాగా.. చిరుతో పాటు అమితాబ్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ .. తదితర భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్-02న థియేటర్లలోకి రానుంది.