బాలయ్య రైతుకు బిగ్ బి నో చెప్పడానికి కారణం..!

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఓ వైపు 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం చేస్తూనే మ‌రో వైపు 101వ చిత్రం చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నారు. బాల‌య్య 101వ చిత్రంగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.
ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను అమితాబ్ బ‌చ్చ‌న్ తో చేయిస్తే బాగుంటుంద‌ని అనుకోవ‌డం అమితాబ్ ను క‌ల‌వ‌డం జ‌రిగింది. రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న స‌ర్కార్ 3 సెట్స్ లో బాల‌య్య‌, కృష్ణ‌వంశీ బిగ్ బిని క‌లిసారు. రైతు క‌థ గురించి, అమితాబ్ పాత్ర గురించి చెప్పగా ఓకే ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి ట్రై చేస్తాను అన్నార‌ట‌. దీంతో అమితాబ్ రైతు సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించారు అంటూ ప్ర‌చారం చేసారు. ఇప్పుడు అమితాబ్ త‌న షెడ్యూల్స్ చూసి జులై వ‌ర‌కు డేట్స్ ఖాళీలేవు. జులై వ‌ర‌కు ఆగితే చేస్తాను అని చెప్పార‌ట‌. అయితే...అమితాబ్ కోసం జులై వ‌ర‌కు ఆగ‌డం క‌న్నా వేరే ఏక్ట‌ర్ తో ఈ క్యారెక్ట‌ర్ చేయిద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అది సంగ‌తి..!