Sharmila:ఈ డ్రామాలన్నీ ఎందుకు చిన్న దొర? ఓట్ల కోసమే కదా: షర్మిల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రక్షాళన చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. "ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పలకలేదు గాని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడు" అని ట్వీట్ చేశారు.
మీరు నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారు..
"బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించింది మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అంటున్నది మీరే. ఈ డ్రామాలన్నీ ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా! ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం. మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారు.ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పండి. నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరు.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు చాలు.. ఈ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుంది. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారు మీరు" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
మూడో సారి అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేటీఆర్ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్యను ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఆ యువతి తల్లి తనను కలిస్తే ఆదుకుంటామని చెప్పామని.. ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల పైవిధంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout