Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ట్రోఫీ ఎందుకు దూరమైంది.. రన్నరప్‌గా నిలిచినా వచ్చింది సున్నా
- IndiaGlitz, [Monday,December 18 2023]
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా.. వీరిలో ప్రేక్షకుల ఆమోదం పొందిన ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. ఆటలు, పాటలతో ఈ గ్రాండ్ ఫినాలేను కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు నిర్వాహకులు. ఆరుగురు ఫైనల్‌కు వెళ్తే చివరికి పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు మిగలగా.. వీరిలో చాలామంది అమర్‌దీప్‌దే కప్ అని అనుకున్నారు. సీరియల్ నటుడు కావడం, జనానికి పరిచయమైన పేరు కావడంతో ఓట్లు బాగానే పడి వుంటాయని అంతా భావించారు. కానీ ఆశ్చర్యకరంగా పల్లవి ప్రశాంత్‌ను నాగార్జున విజేతగా ప్రకటించడం అంతా షాక్ అయ్యారు.
నిజానికి అమర్‌దీప్ తొలినాళ్లలో ఆటపై అంత శ్రద్ధ పెట్టినట్లుగా కనిపించలేదు. కానీ సీజన్ చివరి వారాల్లో అమర్ తన విశ్వరూపం చూపించాడు. అతనికి తొలుత ఓట్లు చాలా తక్కువగా వుండేవి. కానీ ఎప్పుడైతే లోపలి మనిషి బయటకు రావడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి జనానికి నచ్చడం మొదలుపెట్టాడు. అయితే అమర్‌దీప్‌కు స్పై బ్యాచ్ (శివాజీ , ప్రశాంత్, యావర్)తో అసలు పడేదికాదు. ఇంట్లో అంతా తనకు అనుకూలంగా వుండాలని, తనకు సహకరించాలని అమర్ ఆశించేవాడు. తనను కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చి శివాజీ తప్పాడంటూ అక్కసు వెళ్లగక్కేవాడు. చివరికి ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడ్డాడు కూడా. టాస్క్‌లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత అతను చాలా స్వార్ధపరుడని జనం గ్రహించారు. గెలవలేని పరిస్ధితుల్లో ఏడ్చి విజయం సాధించడాన్ని స్ట్రాటజీగా మార్చుకున్నాడు అమర్.
ఇక చివరి వారాల్లో అమర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంకను ఫిజికల్‌గా అటాక్ చేయడం, ఆమె నొప్పితో, ఓటమితో బాధపడుతుంటే పాయింట్లు ఇవ్వలేదంటూ మాటలతో వేధించడం వంటి పనులతో అమర్‌దీప్ కొంత నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. కానీ అతనిలోని అమాయకత్వాన్ని ఇష్టపడ్డ ప్రేక్షకులు ఓట్లు వేశారు. చివరిలో పల్లవి ప్రశాంత్‌తో గొడవ మరో ఎత్తు. ఓ టాస్క్‌లో తనను అమర్ కొరికాడంటూ ప్రశాంత్ పంటిగాట్లు చూపించాడు. అంతే అమర్ కోపం కట్టలు తెంచుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంటూ ప్రశాంత్‌ను లాక్కెళ్లాడు. దీనికి నాగార్జున సైతం చురకలంటించారు. పిచ్చి నా కొడుకు లా ఏంటీ ఆ పనులు అంటూ మొట్టికాయలు వేశారు. అయితే హౌస్‌కి కెప్టెన్ కావాలనే అతని కోరికను నాగార్జున తీర్చారు.
కాగా.. రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌కు ఏం లభించలేదు. ఒట్టి చేతులతోనే స్టేజ్ వీడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అమర్ అమాయకత్వం బయటపడింది. ప్రిన్స్ యావర్.. తాను ఎలాగూ గెలవనని నిర్ణయించుకుని రూ.15 లక్షలు తీసుకుని బయటకు వచ్చేశాడు. అమర్‌దీప్ మాత్రం రన్నరప్‌గా నిలిచినప్పటికీ ఒట్టి చేతులతోనే స్టేజ్ వీడాల్సి వచ్చింది. అయితే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపు కారణంగా వారానికి రూ.2.5 లక్షలు రెమ్యూనరేషన్ సంపాదించాడు. అంటే 15 వారాలకు గాను రూ.37,50,000 అందుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో ప్రభుత్వమే సగం లాగేసుకుంటుంది.