బాలీవుడ్ సూపర్ స్టార్ ను అఖిల్ కలవడానికి కారణం..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ను అక్కినేని అఖిల్ ముంబాయిలో కలిసారు. వైజాగ్ లో అఖిల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం ముంబాయి వెళ్లారు. అక్కడ హృతిక్ రోషన్ ను కలిసారు. ఈ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...సూపర్ స్టార్ ను కలవడం సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
హృతిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కాబిల్ తెలుగులో బలం పేరుతో రిలీజ్ అవుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేసాడు. అఖిల్ స్పందనకు హృతిక్ కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ...అఖిల్ ను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నాన్న గారిని ఫ్యామిలీ మెంబర్స్ ను అడిగినట్లు చెప్పమంటూ థ్యాంక్స్ తెలియచేసాడు. హృతిక్ రోషన్ కాబిల్ జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com