గూబ గుయ్ మన్నది ఎవరికి..?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ...టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే...జనతా గ్యారేజ్ విజయోత్సవంలో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే...తమ్ముడు (ఎన్టీఆర్),నేను మూడు సంవత్సరాల నుంచి కొట్టాలి కొట్టాలి అని వెయిట్ చేస్తున్నాం. ఆఖరికి ఈ సినిమాతో గూబ గుయ్ మనేలా కొట్టాం. ఈ సినిమాతో మా నందమూరి ఫ్యాన్స్ ఆకలి తీరింది. మా తమ్ముడు ఆకలి తీరింది అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు కళ్యాణ్ రామ్.
అయితే...తాజాగా చెబుతున్న లెక్కల ప్రకారం జనతా గ్యారేజ్ దాదాపు 75 కోట్లు షేర్ సాధించింది అంటున్నారు. ఈ సినిమా బాహుబలిని క్రాస్ చేయలేదు. శ్రీమంతుడుని క్రాస్ చేయలేదు. మరి...కళ్యాణ్ రామ్ అంతలా ఎమోషన్ అవ్వడానికి కారణం ఏమిటి..? అంటూ కళ్యాణ్ రామ్ మాటల గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే... ఇంతకీ గూబ గుయ్ మన్నది ఎవరికి..? అంటూ ఆసక్తికర చర్చ జరగుతుంది. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించేలా ఏదో మాట్లాడాలి అని అలా మాట్లాడారా..? లేక మాటల వెనక ఇంకేదైనా ఉందా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. మరి...ఆ మాటల వెనక మర్మం కళ్యాణ్ రామ్ కే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout