అఖిల్, బ్రూస్ లీ... వార్ లో విన్నర్ ఎవరు..?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమవుతున్న మూడోతరం మరో వారసుడు అఖిల్. నాగార్జున నాగ చైతన్యను పరిచయం చేసినప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కినేని హీరోలు అంటే క్లాస్ ఇమేజ్ వారి సొంతం. నాగ్ అటు క్లాస్...ఇటు మాస్...ఇద్దరిని మెప్పించాడు. అఖిల్ ను చూడగానే మిల్క్ బాయ్ లా ఉంటాడు. అలాంటి అఖిల్ కి మాస్ ఇమేజ్ తీసుకురావాలంటే ఏం చేయాలని ఆలోచించి...ఆ బాధ్యతను వినాయక్ అప్పగించాడు నాగ్. ఇక నిర్మాణ బాధ్యతలు విషయానికి వస్తే...తన సొంతం సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే అఖిల్ తొలి సినిమా తీయాలనుకున్నా...కొన్ని కారణాల వలన నిర్మాణ బాధ్యతలు నితిన్ కి ఇవ్వవలసి వచ్చింది.
సినిమా ప్రారంభం నుంచి అఖిల్ తొలి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖిల్ సినిమాకి దాదాపు 50 కోట్లు పైగా బిజినెస్ జరుగుతుంది. తొలి చిత్రానికే ఇంత బిజినెస్ జరగడం బహుశా ఏ హీరోకి జరగలేదు. ఇదో రికార్డ్. మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తియ్యింది. అఖిల్ ఆడియోను అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20న అభిమానులు, అతిరధమహారధుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 21న అఖిల్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ...అఖిల్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరే ఏం జరగనుందో అర్థం కాని పరిస్థితి.
అసలు విషయం ఏమిటంటే...రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం బ్రూస్ లీ. ఈ సినిమాలో మెగాస్టార్ ఓ ముఖ్యపాత్ర కూడా పోషిస్తున్నారు. దీంతో చరణ్ బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్రూస్ లీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే అఖిల్ సినిమాకి, చరణ్ బ్రూస్ లీ సినిమాకి మధ్య గ్యాప్ వారమే.ఇప్పుడు పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. కనుక పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో రెండు వారాలు గ్యాప్ ఉంటే మంచిది. రెండు పెద్ద సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ అయితే సినిమా ఎంత బాగున్నా...ఎవరో ఒకరు నష్టంపోక తప్పదు. ఈ విషయం తెలిసే బాహుబలి రిలీజ్ టైంలో శ్రీమంతుడు చిత్రాన్ని వాయిదా వేయమని బాహుబలి టీం రిక్వెస్ట్ చేయడం...వారి రిక్వెస్ట్ మేరకు శ్రీమంతుడు వాయిదా వేయడం జరిగింది. దాని వలన బాహుబలి...శ్రీమంతుడు ఇద్దరికి మేలు జరిగింది.
ఇలాంటిది...బ్రూస్ లీ, అఖిల్ వారం గ్యాప్ లో వచ్చేస్తాం అంటున్నారు. కానీ వారం గ్యాప్ కుదరకపోతే ఒక రోజు గ్యాప్ లో అయినా సరే అంటే అక్టోబర్ 21 అఖిల్, 22 బ్రూస్ లీ రిలీజ్ చేస్తాం అంటున్నారు. చిరంజీవి, నాగార్జున ఇద్దరు...మంచి మిత్రులు. అలాగే చరణ్, అఖిల్ వీరిద్దరు కూడా మంచి ఫ్రెండ్సే. అయినా ఎందుకనో ఇద్దరు ఈ దసరాకి ఎలాగైనా సరే సినిమాలు రిలీజ్ చేస్తాం అంటున్నారు.
ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వారం గ్యాప్ లోనో, లేక ఒక్కరోజు గ్యాప్ లోనే వస్తే మాకు చాలా నష్టం వస్తుందంటూ లబోదిబో మంటున్నారు. మరి...డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ మేరకు రెండు వారాల గ్యాప్ తీసుకుంటారా...? లేదా..? ఒకవేళ రిలీజ్ వాయిదా వేయాల్సి వస్తే ఎవరు దసరా సీజన్ ని త్యాగం చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments