మెగా వార్ లో...విజేత ఎవరు..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరోలు మధ్య వార్ మొదలైంది.ఇంతకీ మెగా హీరోల మధ్య వార్ ఏమిటనుకుంటున్నారా..? వారం గ్యాప్ తో ముగ్గురు మెగా హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వారిలో ముందుగా సాయిథరమ్ తేజ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారీష్ శంకర్ తెరకెక్కించాడు.
ఈ సినిమా వచ్చిన వారానికి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కంచె చిత్రంతో అక్టోబర్ 2న రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని క్రిష్ చాలా ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో రూపొందించాడు. ఈ సినిమా వచ్చిన వారానికి అక్టోబర్ 9న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రుద్రమదేవి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు. రుద్రమదేవి చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. ఫైనల్ గా అక్టోబర్ 9న కన్ ఫర్మ్ గా రిలీజ్ చేస్తానంటున్నాడు గుణశేఖర్. మరి...ఈ ఆసక్తికర మెగా వార్ లో విజేతగా నిలిచేదెవరో...తెలియాంటే అక్టోబర్ 9 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com