ఇద్దరిలో ఎవరు మురిపిస్తారో?
Send us your feedback to audioarticles@vaarta.com
తమన్నా, కాజల్.. ఒకే టైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర తారలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే విశేషంగా ఇప్పటివరకు ఈ ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటించిన సందర్భాలు లేవు. అయితే ఒకే సమయంలో ఒకే సినిమాకి సంబంధించిన రీమేక్‌లో మాత్రం నటిస్తున్నారు. ఆ సినిమానే .. హిందీలో విజయం సాధించిన క్వీన్.
తమిళంలో పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కుతుంటే అందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో టైటిల్ ఇంకా పేరు నిర్ణయించకపోయినా.. తమన్నా ఆ పాత్రలో నటించనుంది. ఈ ఇద్దరు కూడా తమ నటనతో కొన్ని సినిమాలను నిలబెట్టిన సందర్భాలున్నాయి. మరి ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ని కూడా వారు నిలబెడతారో లేదో చూడాలి. అంతేకాకుండా.. ఒకే సినిమాని రీమేక్ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా మురిపిస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com