సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఎవరు...?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ బాబీ. అయితే డైరెక్ట‌ర్ బాబీతో డిఫ‌రెన్స్ రావ‌డం వ‌ల‌న ఈ సినిమా నుంచి కెమెరామెన్ జ‌య‌న‌న్ విన్సెంట్ త‌ప్పుకున్నారు.

ఆయ‌న‌తో పాటు టెక్నిక‌ల్ టీమ్ లో మ‌రొక‌రు ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ట‌. తాజాగా ఈ సినిమా నుంచి డైరెక్ట‌ర్ బాబీని త‌ప్పించార‌ని..త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ఎనౌన్స్ చేస్తారంటూ ఫిలిం న‌గ‌ర్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది.మ‌రి..ఇది నిజ‌మా...? కాదా..? ఒక‌వేళ బాబీ ని త‌ప్పించ‌డం నిజ‌మైతే..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు..? ఇలాంటి ప్ర‌చారానికి ఫుల్ స్టాఫ్ ప‌డాలంటే స‌ర్ధార్ యూనిట్ స్పందించాల్సిందే.