ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో...!

  • IndiaGlitz, [Friday,October 28 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం రిలీజ్ కావ‌డం...బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డం...50 రోజులు పూర్తి చేసుకోవ‌డం కూడా జ‌రిగిపోయింది. కానీ...ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో అనేది మాత్రం తెలియ‌లేదు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఉంటుంది అనుకున్నారు. ఇజం త‌ర్వాత ఈ మూవీకి సంబంధించి ఎనౌన్స్ మెంట్ వ‌స్తుంది అని ప్ర‌చారం జ‌రిగింది. కానీ..అది జ‌రిగేలా క‌న‌ప‌డ‌డం లేదు. జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ ను మ‌రింత పెంచే డైరెక్ట‌ర్ కోసం ఎన్టీఆర్ చూస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఈ టైమ్ లో సినిమా చేస్తే బాగుంటుంది అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారు అయితే..త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ తో సినిమా చేస్తుండ‌డంతో ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌దు.

ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ ర‌విపూడి ఎన్టీఆర్ కోసం క‌థ రెడీ చేసిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేద‌ట‌. ఇప్పుడు ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం వినాయ‌క్ తో ఉంటుంది అని కొత్త ప్ర‌చారం ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్, వినాయ‌క్ కాంబినేష‌న్లో రూపొందిన అదుర్స్ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. అదుర్స్ స‌క్సెస్ అయిన‌ప్ప‌టి నుంచి అదుర్స్ 2 చేయాలి అనుకుంటున్నారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌ర‌లేదు. తాజాగా ఎన్టీఆర్ - వినాయ‌క్ క‌లిసి అదుర్స్ 2 చేయ‌నున్నార‌ని, క‌థ రెడీగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న రేంజ్ మ‌రింత పెంచే డైరెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగ‌ర్ కి వినాయ‌క్ తో అనుకుంటున్న అదుర్స్ 2 అయినా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి..!

More News

'ఎంత వరకు ఈ ప్రేమ' పాటలు విడుదల

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`.

సూర్య ఎస్ 3 మోషన్ పోస్టర్ రిలీజ్..!

సూర్య-హరి కాంబినేషన్ లోరూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎస్ 3.

ఫ్యాన్స్ కి చిరు అందిస్తున్న దీపావళి గిఫ్ట్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.

నాని నేను లోకల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

నేచురల్ స్టార్ నాని,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం నేను లోకల్.

తెలుగుదేశం పార్టీలో చేరుతున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం...ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.