కేసీఆర్ ఢిల్లీకెళితే.. తెలంగాణ సీఎం పగ్గాలెవరికి!?
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల రాక మునుపే తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. రాష్ట్రాల హక్కులు కేంద్రం చేతిలో ఉండటమేంటి మా హక్కులు మాకే కావాలని.. ఎన్డీఏ, యూపీఏ యేతర ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు చేసి ఢిల్లీలో చక్రం తిప్పి తన సత్తా ఏంటో చూపించాలని గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో చక్రం తిప్పాలంటే దాదాపు రాష్ట్రాన్ని వదిలేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. సీఎంగా ఉంటూ కూడా ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు. అయితే ఒకవేళ కేసీఆర్ ఢిల్లీకే ఫుల్‌ఫిల్‌గా పరిమితమైతే తెలంగాణను ఎవరి చేతిలో పెడతారాన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంలో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న!
మే-23న ఏం జరగబోతోంది!?
కేసీఆర్ ఢిల్లీకెళితే తన వారసుడు, ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారా..? లేకుంటే టీఆర్ఎస్ అంటే హరీశ్.. హరీశ్ అంటే టీఆర్ఎస్‌గా కాపాడుకుంటూ కేసీఆర్ కుటుంబానికి కట్టప్పలా ఉన్న హరీశ్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం టీఆర్ఎస్ ఈ స్థాయిలో ఉండటానికి.. రెండోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరడానికి మొదటి కారకుడు హరీషే.. ఇది జగమెరిగిన సత్యమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేసీఆర్ ఢిల్లీకే పరిమితం అవ్వాల్సి వస్తే.. అటు కేటీఆర్‌కు పగ్గాలు ఇవ్వాలా..? హరీష్‌కు ఇవ్వాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారట.
అదే జరిగితే ‘కారు’ పర్మినెంట్‌గా షెడ్డుకే!
ఒకవేళ హరీష్‌ను కాదని.. కేటీఆర్‌కు సీఎం పగ్గాలు ఇస్తే మాత్రం ‘కారు’కు పంచెర్లు పడటమే కాదు.. పర్మినెంట్‌గా షెడ్డులో పెట్టాల్సి వస్తుందని.. ఆ నష్ట నివారణకు మెకానిక్‌లు ఎంత మందివచ్చినా కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సో.. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో..? ఇద్దరిలో ఎవరినో ఒకర్ని పీఠమెక్కించి ఢిల్లీకెళతారా..? లేకుంటే ఈ టెర్మ్ కేసీఆరే సీఎం ఉండిపోతారా..? అనేది తెలియాలంటే మే-23కు వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout