ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వారం ఆసక్తికరంగానే నడిచింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ టీం కుమార్ సాయిని నిర్వాహకులు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకూ ఆయన ఏమాత్రం తన ఆట తీరునైతే కనబరచలేదు. ఇప్పటి వరకూ హైలైట్ అయ్యిందైతే లేదు. ఆ తరువాత వచ్చిన అవినాష్ మాత్రం.. అదరగొట్టేస్తున్నాడు. వచ్చిన వెంటనే అందరితో కలిసి పోయాడు. దీంతో కంటెస్టెంట్లు కూడా అవినాష్‌ని ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా కాకుండా తమతో ట్రావెల్ చేస్తున్న ఓ కంటెస్టెంట్‌గా మాత్రమే చూశారు.
మొదటి వారం పెద్దగా ఒకరిద్దరు తప్ప ఎవరూ హైలైట్ అవ్వలేదు. కానీ రెండో వారం దాదాపు ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ని బయట పడుతూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతూ వస్తున్నారు. ఇక ఎలిమినేషన్ సమయం రానే వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్ అనేది ముగిసింది. ఈ సారి ఎలిమినేషన్‌లో గంగవ్వ, అభిజిత్, అమ్మ రాజశేఖర్, నోయెల్, మొనాల్, దేత్తడి హారిక, కరాటే కల్యాణి, సొహైల్, కుమార్ సాయి ఉన్నారు. అయితే ఈ సారి విశేషం ఏమిటంటే.. ఓటింగ్ విషయంలో ఒకరితో మరొకరికి తీవ్ర స్థాయిలో పోటీ జరిగినట్టు తెలుస్తోంది.
గత వారంతో పోలిస్తే ఈ వారం గంగవ్వ అంతగా ఓటింగ్‌ను ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. దాదాపు ఆమెతో సమానంగా అభిజిత్ ఓట్లను పొందడం విశేషం. దీంతో వీరిద్దరికీ వచ్చిన ఇబ్బందైతే ఏమీ లేదు. సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. మూడో ప్లేస్‌లో నోయెల్, సొహైల్‌కు పోటాపోటీగా ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో దేత్తడి హారిక, మొనాల్‌లు ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా పోటా పోటీ ఓటింగ్ జరిగనట్టు సమాచారం. వీరిద్దరూ సేఫ్ జోన్‌లోనే ఉన్నారు.
ఇక ఆ తరువాతి స్థానంలో కుమార్ సాయి ఉన్నాడు. కాబట్టి కుమార్ సాయికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఇక మిగిలింది.. అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణి. వీరిద్దరి మధ్యే ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో ఇమడలేకపోతోంది కాబట్టి బిగ్‌బాస్ ఆమెను పంపించేయాలని భావిస్తే చెప్పలేము. లేదంటే మాత్రం అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణిలలో ఒకరి ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది. అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కరాటే కల్యాణికే ఉన్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout