ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4లో ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. ఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా పెద్ద అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్‌బాస్ షో.. ఇప్పటి వరకైతే గత సీజన్ల మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పెద్దగా పస లేని టాస్క్‌లతో ఈ వారమంతా కాస్త గందరగోళంగా నడిచింది. ఇప్పటి వరకూ షో ఎలా నడిచిందనే విషయాన్ని పక్కనబెడితే ఈ వారం ఎలిమినేట్ అవబోయేది ఎవరనేది చర్చ జరుగుతోంది.
అయితే ఈ వారంలో నామినేషన్‌లో అభిజిత్, సూర్య కిరణ్, సుజాత, అఖిల్, దివి, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. కాగా.. గంగవ్వ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమెకు వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదు. ఇక ఆమె తరువాతి స్థానంలో అభిజిత్ ఉన్నాడు. గంగవ్వ అంత స్థాయిలో ఓటింగ్‌ను పొందలేకపోయినా మంచి ఓటింగ్‌నే అభిజిత్ సంపాదించుకుంటున్నాడు. ఇక అఖిల్.. స్మార్ట్ ప్లేయర్. మొదటి నుంచి ఎలాంటి వివాదాలూ పెద్దగా లేకుండా.. చక్కగా గేమ్ ప్లే చేస్తూ వెళుతున్నాడు కాబట్టి అఖిల్‌కి వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు.
ఇక మెహబూబ్ విషయానికి వస్తే.. ఇంతవరకూ అతని పెర్ఫార్మెన్స్ ఏమీ కనిపించకపోయినా బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏమీ లేదు కాబట్టి మెహబూబ్‌కి కూడా ఢోకా లేదు. మూడు రోజులు ఓటింగ్ పరంగా దివి చాలా తక్కువ స్థానంలో ఉంది. ఎందుకంటే ఆ మూడు రోజుల్లో దివి పెర్ఫార్మెన్స్ ఏమాత్రం కనిపించలేదు. దీంతో ఓటింగ్ పరంగా చాలా వెనుకబడి ఉంది. ఆ తరువాత బిగ్‌బాస్ ఒక హౌస్‌లోని అందరి వ్యక్తుల గురించి చెప్పాలని ఓ టాస్క్ ఇచ్చి ఒక్కసారిగా ఆమెను హైలైట్ చేశారు. ఆమె ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి వివరించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో దివికి ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతానికి ఆమె ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కిందనే చెప్పాలి.
ఇక సుజాత మొదటి రెండు రోజులు చూపిన హుషారు.. తర్వాత చూపించలేదనే చెప్పాలి. దీంతో ఆమె పెద్దగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. ఇక సూర్యకిరణ్ విషయానికి వస్తే కావల్సినంత నెగిటివిటీని ఈ ఐదు రోజుల్లో సంపాదించేసుకున్నారు. దీంతో ఈ వారం సుజాత కానీ సూర్యకిరణ్ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments