ముగ్గురిలో ప‌వ‌న్ ఎవ‌రికి ఓటేస్తాడో..?

  • IndiaGlitz, [Monday,August 17 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత స్పీడు పెంచాడే కానీ.. త‌గ్గించ‌లేదు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్‌తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉంది. మ‌రో వైపు డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ప‌వ‌న్ 28వ సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసుకుని రెడీగా కూర్చుని ఉన్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం అయిన ప‌వ‌న్ మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పేశార‌ట‌. ప‌వ‌న్‌కు స‌న్నిహితుడైన నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తార‌ని స‌మాచారం.

ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోయే ద‌ర్శ‌కుల రేసులో ముందుగా సురేంద‌ర్ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా ప‌వ‌న్ 29ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుల లిస్టులో ఉన్నార‌ట‌. వారిలో ఇది వ‌ర‌కు ప‌వ‌న్‌తో గోపాల‌గోపాల‌, కాట‌మ‌రాయుడు సినిమాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు డాలీతో పాటు మ‌రో ద‌ర్శ‌కుడు కూడా రేసులో ఉన్నార‌ట‌. మ‌రి ప‌వ‌న్ ఈ ముగ్గురు ద‌ర్శ‌కుల్లో ఎవ‌రికి ఓకే చెబుతారో చూడాలి. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ పుట్టిన‌రోజు(సెప్టెంబ‌ర్‌2)న ఈ సినిమాల్లో ఏదైనా అధికారికంగా ప్ర‌క‌టిస్తారేమో చూడాలి. ఇప్ప‌టికే హ్యాపీ బ‌ర్త్ డే టు ప‌వ‌న్ అనే హ్యాష్ ట్యాగ్‌తో 65.05 మిలియ‌న్స్‌తో వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న పుట్టిన‌రోజున ఎలాంటి సంద‌డి చేస్తారో వేచి చూడాలి.

More News

క‌థ చెప్ప‌డానికి అంత ఖ‌ర్చా!!

సినిమా క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డానికి నిర్మాత డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతుంటారు. స్టార్ హీరోల సినిమాల‌కైతే ఈ లెక్క పెద్ద‌దిగానే ఉంటుంది.

రైట‌ర్‌గా మారుతున్న ర‌మా రాజ‌మౌళి?

ప్యాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి ఆయ‌న సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

నాన్నగారికి ప్రమాదమేమీ లేదని వైద్యులంటున్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ తాజా అప్‌డేట్ ఇచ్చారు.

కులంపై రామ్ ట్వీట్‌

తాను ఇక ట్వీట్స్ చేయ‌న‌ని చెప్పిన రామ్ ఆ మాట చెప్పి ఇర‌వై నాలుగు గంట‌లు గ‌డ‌వ‌క ముందే ట్వీట్ పెట్టారు.

సందీప్‌ కిషన్‌ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం,