టికెట్ ధరల వివాద: ఎల్లుండి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి వెంట ఎవరెవరు..?
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టాలనే ఆలోచనలో వుంది. దీనిలో భాగంగా ఎల్లుండి సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రితో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో భేటీలో ఏం చర్చించాలన్న దానిపై నాని నుంచి వివరాలు తెలుసుకున్నారు జగన్.
అంతా బాగానే వుంది కానీ.. చిరంజీవి వెంట జగన్ వద్దకు సినీ పరిశ్రమం నుంచి ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవి ఒక్కరే సీఎంతో సమావేశం అయ్యారు. దాంతో అది పరిశ్రమ బాగుకోసం కాక.. వ్యక్తిగత సమావేశంగా ముద్రపడింది. ఇప్పటికే టాలీవుడ్ అంటే ఏ ఒక్కరో కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. .
ఈసారి తనపై విమర్శలు రాకుండా చిరంజీవి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. సినీ ప్రముఖులందరితో సమావేశం నిర్వహించి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన ఎజెండాను ఖరారు చేయాలనుకున్నారు. ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో సమావేశం కావాలని ఆయన గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. నిన్నా, ఇవాళ కూడా ఈ భేటీ అనివార్య కారణాలతో వాయిదా పడింది.
చిరంజీవితో పాటు నాగార్జున ఖచ్చితంగా వెళతారు. అలాగే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి బడా సినిమాలు తీసిన నిర్మాతలు.. ఏపీలోని టికెట్ రేట్లతో ఇబ్బందులు పడతారు. కాబట్టి వారు కూడా వెళ్లడం ఖాయమే. ఇంకెవరు వెళ్తారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై రేపు సాయంత్రానికి క్లారిటీ వస్తుందని ఫిలింనగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments