టికెట్ ధరల వివాద: ఎల్లుండి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి వెంట ఎవరెవరు..?

రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టాలనే ఆలోచనలో వుంది. దీనిలో భాగంగా ఎల్లుండి సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రితో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో భేటీలో ఏం చర్చించాలన్న దానిపై నాని నుంచి వివరాలు తెలుసుకున్నారు జగన్.

అంతా బాగానే వుంది కానీ.. చిరంజీవి వెంట జగన్ వద్దకు సినీ పరిశ్రమం నుంచి ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవి ఒక్కరే సీఎంతో సమావేశం అయ్యారు. దాంతో అది పరిశ్రమ బాగుకోసం కాక.. వ్యక్తిగత సమావేశంగా ముద్రపడింది. ఇప్పటికే టాలీవుడ్ అంటే ఏ ఒక్కరో కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. .

ఈసారి తనపై విమర్శలు రాకుండా చిరంజీవి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. సినీ ప్రముఖులందరితో సమావేశం నిర్వహించి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన ఎజెండాను ఖరారు చేయాలనుకున్నారు. ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో సమావేశం కావాలని ఆయన గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. నిన్నా, ఇవాళ కూడా ఈ భేటీ అనివార్య కారణాలతో వాయిదా పడింది.

చిరంజీవితో పాటు నాగార్జున ఖచ్చితంగా వెళతారు. అలాగే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి బడా సినిమాలు తీసిన నిర్మాతలు.. ఏపీలోని టికెట్ రేట్లతో ఇబ్బందులు పడతారు. కాబట్టి వారు కూడా వెళ్లడం ఖాయమే. ఇంకెవరు వెళ్తారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై రేపు సాయంత్రానికి క్లారిటీ వస్తుందని ఫిలింనగర్ టాక్.

More News

థర్డ్ వేవ్ ముగిసింది.. ఏ ఆంక్షలు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయొచ్చు: తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయినట్లేనని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న 'శశివదనే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం 'శశివదనే'.

ఆ సీన్ చూస్తున్నప్పుడు.. ‘‘ఊపిరి తీసుకోలేరు, హార్ట్‌బీట్ పరిగెడుతుంది’’ : ఆర్ఆర్ఆర్‌పై జక్కన్క కామెంట్స్ వైరల్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ రిలీజ్ అవుతుందని అంతా భావించిన వేళ..

ఆ యాడ్ కోసం మహేశ్ అంత తీసుకున్నాడా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు.

మహాభారత్‌లో ‘భీముడు’ ప్రవీణ్ కుమార్ ఇక లేరు

ఓ 30 ఏళ్లు వెనక్కి వెళితే.. అప్పుడప్పుడే భారత్‌లో టీవీలు రంగ ప్రవేశం చేస్తున్న  కాలం. దూరదర్శన్ తప్పించి మరో ఛానెల్ లేని సమయం.