కొవిడ్ చికిత్సకు ఇవర్‌మెక్టిన్ వాడొద్దు: డబ్ల్యూహెచ్‌వో

  • IndiaGlitz, [Tuesday,May 11 2021]

కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇక మీదట కొవిడ్ నివారణకు సంబంధించి ఇవర్‌మెక్టిన్ ఔషధాన్ని వినియోగించవద్దని హెచ్చిరించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవర్ మెక్టిన్ నోటి ద్వారా తీసుకునే ఔషధమని.. దీనిపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గత నెలలో కూడా ఒకసారి ఈ ఔషధాన్ని వినియోగించవద్దని హెచ్చరించింది.

Also Read: గంగానదిలో కరోనా మృతదేహాల గుట్టలు..

కాగా.. ఇవర్‌మెక్టిన్‌తో కొవిడ్ దరిచేరదని వార్తలు ఊపందుకందుకుంటున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కారణంగా కరోనా మరణాలు తగ్గుతాయనడంలో ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇవర్‌మెక్టిన్‌తో కొవిడ్ దరి చేరదనడం సరికాదని తెలిపింది. కాబట్టి కొవిడ్ చికిత్సలో ఈ ఔషధాన్ని అసలు వినియోగించవద్దని సూచించింది. మరోవైపు శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గోవా ప్రభుత్వం ఈ ఔషధాన్ని సోమవారం ఆమోదించింది.

More News

గంగానదిలో కరోనా మృతదేహాల గుట్టలు..

కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోంది.. దీని కారణంగా మరణాలు ఏ స్థాయిలో ఉంటున్నాయనే దానికి ఈ వార్తే ఉదాహరణ.

తిరుపతి రుయాలో ఘోరం.. 11 మంది ప్రాణాలు బలిగొన్న 15 నిమిషాలు!

తిరుపతిలోని రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణ మృదంగం మోగింది.

థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని సోనూసూద్ సంచలన నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తోందో తెలియనిది కాదు.

తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో రైల్వే కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది.

అమెరికాలో దిల్ రాజు దంపతుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ

నిర్మాత దిల్ రాజు, వైఘా రెడ్డిని గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.