ఢిల్లీ ‘నిజాముద్దీన్’ వ్యవహారాన్ని బయటపెట్టిందెవరంటే..!?
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్లో లాక్డౌన్ విధించడంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొలిక్కి వస్తుందని భావిస్తున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ వ్యవహారంతో ఉలిక్కిపడింది. ఢిల్లీలో జరిగిన ముస్లింల మతపరమైన ప్రార్థనలతో ఒక్కసారిగా మొత్తం కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ అయ్యాయి. దీంతో పరిస్థితి అల్లకల్లోల్లంగా మారిపోయింది. అయితే.. అసలు ఈ నిజాముద్దీన్ వ్యవహారాన్ని మొదట బయటపెట్టిందెవరు..? ఎలా కనుగొన్నారు..? ఈ విషయాన్ని కేంద్రానికి మొదట చెప్పిందెవరు..? అనే ఆసక్తికర విషయాలను తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు నిశితంగా వెల్లడించారు.
మా చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు!
బుధవారం సాయంత్రం కరోనాపై హెల్త్ బులెటిన్ మీడియా ముందుంచిన ఆయన ఢిల్లీ నిజాముద్దీన్ వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చారు. తెలంగాణ నుంచి 1000 మందికి పైగా ప్రార్థనలకు హాజరయ్యారని.. వారిలో ఇప్పటికే దాదాపు అందర్నీ గుర్తించామన్నారు. అయితే ఇంకా 160 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. నిజంగా.. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించామంటే తమ చిత్తశుద్ధేంటో అర్థం చేసుకోవచ్చని మంత్రి ఒకింత ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రానికి చెప్పింది మేమే..!
‘మర్కజ్ కేసుల నుంచి కేంద్రానికి ముందుగా చెప్పింది తెలంగాణ ప్రభుత్వమే. కేంద్రం ఇంకా యాక్టివ్గా పనిచేయాలని. కరోనాపై జరుగుతున్న పోరాటంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. తెలంగాణలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (సమూహ వ్యాప్తి) లేదు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా పనిచేస్తోంది. అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని ముందు తెలంగాణే కేంద్రానికి చెప్పింది. అన్ని రాష్ట్రాల కంటే ముందే మనం లాక్డౌన్ ప్రకటించాం. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు పరీక్షలు నిర్వహించగా 10 మందికి నెగెటివ్ వచ్చింది. ఇవాళ ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తాం’ అని మంత్రి మీడియాకు వెల్లడించారు.
మొత్తానికి చూస్తే.. మర్కజ్ వ్యవహారాన్ని మొట్ట మొదట బయటిపెట్టింది తెలంగాణ ప్రభుత్వమేనన్న మాట. వాస్తవానికి తెలంగాణలో ఇలా కరోనా కేసులు నమోదైన తర్వాతే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout