మలయాళ రీమేక్‌లో నటించేది ఎవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘అయ్యప్పన్ కోశియమ్’. కేరళలో మంచి వసూళ్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ హవల్దార్‌కి మధ్య జరిగే ఈగోవార్తో తెరకెక్కింది. మరి తెలుగులో ఈ సినిమాలో ఎవరు నటిస్తారనేది అందరిలో ఆసక్తిని రేపుతుంది. కుర్ర హీరోలకు సరిపోయే సినిమా కాదు. దీంతో ప్రముఖంగా వెంకటేశ్, నాగార్జునలతో సినిమాను రీమేక్ చేస్తారని సినీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం వెంకటేశ్ అసురన్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీని తర్వాత మరో రీమేక్‌లో నటించడానికి వెంకటేశ్ ఒప్పుకుంటారా? అని తెలియడం లేదు. వెంకటేశ్ ఒప్పుకోకపోతే.. నాగార్జునతో సినిమాను రీమేక్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా రీమేక్‌లో నటిస్తారేమో వేచి చూడాలి. ఈ సినిమాకు జానీ జనార్ధన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com