మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టించేది ఎవ‌రు?

  • IndiaGlitz, [Saturday,March 21 2020]

మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్‌, బిజూ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్పన్ కోశియ‌మ్‌’. కేర‌ళ‌లో మంచి వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ద‌క్కించుకున్నారు. ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్, రిటైర్డ్ హ‌వ‌ల్దార్‌కి మ‌ధ్య జ‌రిగే ఈగోవార్‌తో తెర‌కెక్కింది. మ‌రి తెలుగులో ఈ సినిమాలో ఎవ‌రు న‌టిస్తార‌నేది అంద‌రిలో ఆస‌క్తిని రేపుతుంది. కుర్ర హీరోల‌కు స‌రిపోయే సినిమా కాదు. దీంతో ప్ర‌ముఖంగా వెంక‌టేశ్‌, నాగార్జున‌ల‌తో సినిమాను రీమేక్ చేస్తార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ప్ర‌స్తుతం వెంక‌టేశ్ అసురన్ రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఓ షెడ్యూల్ మిన‌హా సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. దీని త‌ర్వాత మ‌రో రీమేక్‌లో న‌టించ‌డానికి వెంక‌టేశ్ ఒప్పుకుంటారా? అని తెలియ‌డం లేదు. వెంక‌టేశ్ ఒప్పుకోక‌పోతే.. నాగార్జున‌తో సినిమాను రీమేక్ చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారట‌. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ పూర్తి చేసిన త‌ర్వాతే ఈ సినిమా రీమేక్‌లో న‌టిస్తారేమో వేచి చూడాలి. ఈ సినిమాకు జానీ జనార్ధ‌న్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

'కరోనా'పై మీడియాకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు.. వార్నింగ్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

'జనతా కర్ఫ్యూ' సందర్భంగా ఏపీలో బస్సులు బంద్

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. రేపు అనగా ఆదివారం దేశ వ్యాప్తంగా

మార్చి 31వరకు సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఉండవ్!

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజానీకాన్ని గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 250కు పైగా దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. తెలుగు రాష్ట్రాలకూ పాకింది. రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా అనుమానిత కేసులు

'క‌రోనా' లేని భార‌తావనిని సాధిద్దాం: చిరంజీవి

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ప్రధాని పిలుపు.. రేపు 5గంటలకు దద్దరిల్లిపోవాలి!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపుకు