ఏమాత్రం ఊహించని.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన డబ్య్లూహెచ్‌వో
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ ఏ ఒక్కరూ ఊహించని.. షాకింగ్ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కోవిడ్ 19 విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకుంది. కరోనా పేషెంట్స్ ఐసోలేషన్‌లో ఉన్నా లేకున్నా.. క్వారంటైన్లో ఉన్నా లేకన్నా సామాజిక దూరాన్ని పాటించినా పాటించకున్నా ఆ పేషెంట్ తన వ్యాధిని మరొకరికి అంటించలేరని తేల్చి చెప్పింది.
కోవిడ్ 19పై డబ్ల్యూహెచ్‌వోకి చెందిన ఓ అధికారిణి డాక్టర్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలుంటే తప్ప ఎలాంటి లక్షణాలూ లేని వారు కరోనాను ఇతరులకు అంటించలేరని తెలిపారు. అయితే లక్షణాలు లేని వారు ఎంతమంది ఉన్నారో మాత్రం చెప్పలేమన్నారు. కాగా.. ఎలాంటి లక్షణాలు లేని కరోనా రోగులు ఇతరులకు తమ వ్యాధిని అంటించలేరనడానికి అమెరికాకు చెందిన మెన్స్ హెల్త్, సెయింట్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ డేవిడ్ సిమాడి వ్యాఖ్యలను వాన్ కెర్ఖోవ్ ఉదహరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout