దాసరి కొడుకు ప్రభును కిడ్నాప్ చేసిందెవరు!?

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఆయన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేకుంటే ఆయనే ఇంట్లో ఇబ్బందులతో కనిపించకుండా పోయారా..? అనేదానిపై దాసరి కుటుంబంలో టెన్షన్ మొదలైంది. దాసరి ప్రభు ఈ నెల 9న ఇంటినుంచి బయటికి వెళ్లారని.. అప్పటినుంచి ఆయన తిరిగిరాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎంతకీ ఆయన ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఇందోళనకు గురైన కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే చిత్తూర్ జిల్లాకు వెళ్లినట్టు జూబ్లి పోలీసులు గుర్తించారు. మొదటి భార్య దగ్గరకి వెళ్లినట్టు చిత్తూరుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే త్వరలోనే చిత్తూరు జిల్లా పోలీసులతో మాట్లాడి హైదరాబాద్‌కు రప్పిస్తామని దాసరి కుటుంబ సభ్యులకు అభయం చెప్పినట్లు తెలుస్తోంది.

ఇది రెండోసారి..!

దాసరి ప్రభుకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య సుశీలతో ప్రభుకు గతం నుంచే అనేక వివాదాలున్నాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో 2008లో కూడా ఓసారి ఇలాగే కనిపించకుండాపోగా.. ఆ తర్వాత అనూహ్యంగా భార్య సుశీల పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో దాసరి ప్రభు, సుశీల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దాసరి మరోసారి కనపించకపోవడంతో ప్రభు అదృశ్యం వెనుక కుటుంబపరమైన కారణాలు ఉండొచ్చని.. లేదంటే సుశీలే కిడ్నాప్ చేయించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.