కాజల్‌ పెళ్లి చేసుకోబోయే బిజినెస్‌మేన్‌ ఎవరంటే?

  • IndiaGlitz, [Monday,October 05 2020]

దక్షిణాదిలో తెలుగు, తమిళ సినిమాలు సహా బాలీవుడ్‌లోనూ నటించిన హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది కాజల్‌ అగర్వాల్‌. గత కొన్ని రోజుల ముందు నుండి ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సోషల్‌ మీడియా వార్తలపై కాజల్‌ స్పందించలేదు. కానీ అప్పట్లో కాజల్‌ నిశ్చితార్థం కూడా జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకోబోయే బిజినెస్‌మేన్‌ పేరు బయటకు వచ్చింది. వివరాల మేరకు.. గౌతమ్‌ కిచ్లు అనే వ్యాపారవేత్తను కాజల్‌ పెళ్లి చేసుకోనుందట.

ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సహా, మరికొన్ని వ్యాపారాలను నిర్వహిస్తున్న గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ ముంబైలో పెళ్లి చేసుకోనుందని టాక్‌. కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ ఎప్పుడో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అప్పుడే కాజల్‌ పెళ్లి గురించి వార్తలు వచ్చినా, ఆమె సినిమాలపైనే ఫోకస్‌ చేస్తూ వచ్చారు. యువ హీరోలతో పాటు సీనియర్‌ హీరోలైన చిరంజీవి, కమల్‌హాసన్‌ వంటి వారితో నటిస్తుంది కాజల్‌. మరిప్పుడు కాజల్‌ పెళ్లి తర్వాత కూడా నటిస్తుందా? లేక కుటుంబానికే పరిమితం అవుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

More News

సరికొత్త పాత్రలో మాస్‌రాజా రవితేజ...!

మాస్‌ మహారాజాఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘క్రాక్’ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌ సినిమాలో నటించాల్సి ఉంది.

సంజయ్ దత్ తాజా పిక్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు చెందిన తాజా పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎమ్మెల్సీ బరిలో జర్నలిస్టులు..

జర్నలిస్టులు రాజకీయరంగ ప్రవేశం చేయడమనేది కొత్తేమీ కాదు... కానీ ఎమ్మెల్సీ బరిలో ఈ స్థాయిలో పోటీ చేయడమే ఇప్పటి వరకూ జరిగి ఉండకపోవచ్చు.

ఈ వారమైనా భజన ఆపుతారా?

బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభమైన తొలి వారం ఈ షో ఏంటి? అసలు ముక్కూ మొహం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టి వీళ్లేం సాధించాలని అనుకుంటున్నారు?

అమెరికాకు మహేష్.. 45 రోజులు అక్కడే..

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన చిత్ర పరిశ్రమ.. కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు...