ప్రభాస్ .. సీత ఎవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ దర్శకత్వంలో పౌరాణికం రామాయణంను ఆదిపురుష్ పేరుతో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో రోజుకొక వార్త వినిపిస్తుంది. ప్రధానంగా వినిస్తోన్న వార్త అసలు ఈ సినిమాలో సీతగా ఎవరు నటిస్తారు? అనే అంశం. ప్రభాస్ పక్కన సీతగా పలానా హీరోయిన్ నటిస్తుందంటూ ఒక్కొక్క హీరోయిన్ పేరు వినిపిస్తూనే ఉంది. ఈ లిస్టులో అనుష్క, కీర్తిసురేశ్ పేర్లు ప్రముఖంగానే వినిపించాయి. అయితే తాజాగా అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కియారా అద్వాని సీతగానటిస్తుందని అంటున్నారు. అలాగే రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తారని టాక్. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో విడుదల తర్వాత రాధేశ్యామ్ సెట్స్‌పై ఉంది. నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆదిపురుష్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్ రూపొందనుంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments