కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత టీకా కోసం 9 నెలలు ఆగాలట..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సలహా కమిటీ కీలక సూచన చేసింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సినేషన్‌ను ఆరు నెలల వ్యవధి ఉండాలని ఇటీవల సూచించిన ప్యానెల్ తాజాగా దానిని 9 నెలలకు పెంచుతూ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) తన తాజా ప్రతిపాదనలను కేంద్రానికి పంపించింది. ఈ వ్యవధి వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్రం త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: తెలంగాణ విద్యార్థికి కరోనా కష్టం.. చెట్టుపైనే ఐసొలేషన్..
కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగు నుంచి 8 వారాల్లోపు టీకా తీసుకోవచ్చని చెబుతోంది. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాండీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్‌టీఏజీఐ వెల్లడించింది. అయితే వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఈ వ్యవధిని మరో మూడు నెలలు అదనంగా పెంచుతూ ప్యానల్ సిఫారసులు చేసింది.
అలాగే కొవిషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య 12-16 వారాల దూరం ఉండాలని కొవిడ్-19 వ్యాక్సిన్ల సలహా కమిటీ గతంలో ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం రెండు డోసుల మధ్య ఎడం 8 వారాలుగా ఉంది. కాగా, యాంటీ సార్స్ కోవ్-2 మోనోక్లోనాల్ యాంటీబాడీస్ తీసుకున్నవారు, లేదంటే ప్లాస్మా ఎక్కించుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి మూడు నెలలపాటు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండాలని ప్యానెల్ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com