దాస‌రిగా పాత్ర‌లో న‌టించేదెవ‌రంటే...

  • IndiaGlitz, [Monday,November 05 2018]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అని రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9.. జ‌న‌వ‌రి 24 తేదీల్లో ఈ రెండు భాగాలు విడుద‌ల‌వుతాయ‌ని అధికారికంగా ప్ర‌కటించేశారు కూడా. నంద‌మూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది.

సినిమాల్లో అగ్ర క‌థానాయ‌కుడిగా ఉండి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసే క్ర‌మంలో ఎన్టీఆర్‌తో స‌ర్దార్ పాపారాయుడు, విశ్వ‌రూపం, మ‌నుషులంతా ఒక్క‌టే, బొబ్బిలిపులి వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేసి ఆయ‌న మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసిన ద‌ర్శ‌కుల్లో ద‌ర్శ‌కర‌త్న దాస‌రి ఒక‌రు. కాబ‌ట్టి ఆయ‌న పాత్ర‌ను కూడా ఈ బ‌యోపిక్స్‌లో చూపించాల‌ని యూనిట్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా.. దాస‌రి పాత్ర‌లో చంద్ర‌సిద్ధార్థ్‌ను న‌టింప‌చేస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కుడు.