ఇద్ద‌రిలో ప‌వ‌న్‌తో చేసెదెవ‌రు?

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ హీరోయిన్‌ను తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావించింది.

ముఖ్యంగా శృతిహాస‌న్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కాగా.. తాజాగా ఈ రేసులో మ‌రో హీరోయిన్ కూడా వ‌చ్చి చేరింది ఆమె ఇలియానా. వీరిద్ద‌రూ ప‌వ‌న్‌తో ఇది వ‌ర‌కు సినిమాలు చేసిన వారే. ప‌వ‌న్‌తో ‘జ‌ల్సా’ సినిమాలో ఇలియానా న‌టిస్తే .. ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌’, ‘కాట‌మ‌రాయుడు’ చిత్రాల్లో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రి వీరిద్ద‌రిలో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎవ‌రి వైపుకు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

రీసెంట్‌గా విడులైన వ‌కీల్ సాబ్ ఫ‌స్ట్ లుక్‌, ‘మ‌గువా మ‌గువా..’ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రో ప‌క్క ప‌వ‌న్ త‌న 27వ సినిమా షూటింగ్‌ను క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేసేశాడ‌ని స‌మాచారం.

More News

సినిమా కోసం హ‌నీమూన్ వాయిదా!!

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ప్ర‌స్తుతం పెళ్లి కంటే సినిమా మూడ్‌లోనే ఉన్న‌ట్లున్నాడు. `అర్జున్ సుర‌వరం` స‌క్సెస్ త‌ర్వాత నిఖిల్ `కార్తికేయ2`

ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ ముహూర్తం కుదిరింది

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో

‘మ‌ధ’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా

బాలయ్యను కూడా బాబు మోసం చేస్తాడేమో.. : ప్రాణ స్నేహితుడు

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రభాస్ సరసన ‘మల్లీశ్వరి’ బ్యూటీ!

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.