కింగ్ మూవీలో కింగ్ రోల్ చేస్తున్న విలన్..!
Tuesday, December 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల తారలు అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే...ఈ మూవీలో జగపతిబాబు ఓ రాజు పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్వరస్వామి భక్తురాలైన కృష్ణమ్మను ప్రేమించే రాజుగా జగపతిబాబు నటిస్తున్నారట. నాగార్జున నటించిన రావోయి చందమామలో జగపతిబాబు నటించారు. మళ్లీ ఇప్పుడు నాగార్జున సినిమాలో జగపతిబాబు నటిస్తుండడం విశేషం. జగపతిబాబు భక్తిరస చిత్రంలో రాజుగా నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఫిబ్రవరి 10న ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments