బాలీవుడ్ 'భీష్మ' ఎవ‌రంటే?

  • IndiaGlitz, [Tuesday,March 24 2020]

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న తెలుగులో విడుద‌లైన భీష్మ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కింది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే..ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ భీష్మ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌. బాలీవుడ్‌లో ప్లేబోయ్‌గా పేరు తెచ్చుకున్న ర‌ణ‌భీర్ క‌పూర్ ఈ రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై క్లారిటీ లేదంటున్నారు. అలాగే డైరెక్ట‌ర్‌పై కూడా త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డుతుంది. తెలుగు సినిమాల‌కు బాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్‌సింగ్ భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు జెర్సీ చిత్రాన్ని కూడాబాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భీష్మ సినిమా కూడా రీమేక్ కానుండ‌టం మ‌న సినిమాల‌కు హిందీలో పెరుగుతున్న క్రేజ్‌కు నిద‌ర్శ‌నంగా చెప్ప‌వ‌చ్చు.

సేంద్రీయ వ్య‌వ‌సాయం ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేసేలా భీష్మ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో అనంత్ నాగ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. మ‌రి బాలీవుడ్‌లో ఈ పాత్ర‌నుఎవ‌రు పోషిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ మంచి మెసేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు.

More News

అదే రోజున ప్లాన్ చేసుకున్న మ‌హేశ్‌?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో

RRR: ఉగాది ట్రీట్‌గా టైటిల్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా

క‌రోనా ప్ర‌భావం... క‌త్రినా అలా! కాజ‌ల్ ఇలా

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినీ రంగం అంతా స్త‌బ్ద‌త నెల‌కొంది. షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ తార‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మైయారు.  ప‌లువురు ప‌లు ర‌కాలుగా స‌మ‌యాన్ని వెల్ల‌దీస్తున్నారు.

షాకింగ్.. చైనాలో మరో ప్రాణాంతక వైరస్..!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచం నలువైపులా విసర్తిరించడంతో ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాలు దాటేసిన ఈ వైరస్ ఎప్పుడు ఎవర్ని సోకుతుందో..?

కరోనాపై ఆందోళన వద్దు.. పారాసిట్‌మాల్‌ వేసుకోండి!

కరోనాపై ఆందోళన వద్దని.. పారాసిటిమాల్ వేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ప్రకటించారు. కాగా ఇదివరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే పారాసిటిమాల్, బ్లీచింగ్ పౌడర్