రీ ఎంట్రీ: విజయశాంతి-టబులో ఎవరు బెస్ట్!?

టాలీవుడ్‌లోకి కొన్నేళ్ల తర్వాత సీనియర్ నటీమణులు విజయశాంతి, టబు ఇద్దరూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి.. నాడు సూపర్‌స్టార్ కృష్ణ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ 13 ఏళ్ల తర్వాత.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా పవర్‌ఫుల్ పాత్ర కావడం.. ఒకటి పదిసార్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి రాములమ్మను సంప్రదించడంతో చేసేదేమీలేక.. ప్రస్తుతం ఖాళీగానే ఉంది గనుక టాలీవుడ్ సినీ ప్రియులు, తన వీరాభిమానులను అలరించడానికి వచ్చేస్తోంది. ఇప్పటికే.. సరిలేరులో ఈమెకు సంబంధించిన లుక్స్, ‘సూర్యుడివో..’ అంటూ సాంగ్స్, ట్రైలర్‌లో డైలాగ్స్ అన్నీ అదుర్స్ అనిపించాయి. మొత్తానికి చూస్తే 13 ఏళ్ల తర్వాత రాములమ్మ రీ ఎంట్రీ మాత్రం గ్రాండ్‌గా అదిరిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చిత్రబృందం ఇచ్చింది. ఈ సందర్భంగా రీ ఎంట్రీ, మహేశ్ మూవీ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మెగాస్టార్-విజయశాంతి మధ్య సుమారు అరగంటపైగా సంభాషణ జరిగింది.

ఇక టబు విషయానికొస్తే..
టబు కూడా ఆషామాషీ హీరోయినేం కాదు.. ఒకప్పుడు సౌత్‌ను ఏలిన హీరోయినే.. ఇక ఆమె నటించిన తెలుగు సినిమాల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్మథుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్యతో పాటు పలువురు తెలుగు హీరోల సరసన నటించి మెప్పించి తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ సంపాదించుకుంది. అలా అప్పట్లో తెలుగు తెరకు దూరమైన ఈ సీనియర్ బ్యూటీ.. ‘అల వైకుంఠపురములో’ అంటూ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బన్నీకి బాగా క్లోజ్ అవ్వడంతో ఆమెను ఏరి కోరి మరీ తన సినిమాలో ఓ ముఖ్యపాత్రను ఇప్పించాడు. సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్‌లో ఈమె మెరిసింది.. రీ ఎంట్రీ తర్వాత పరిస్థితేంటి..? తన పాత్ర గురించి టబు చెప్పుకుంది.

ఎవరు బెస్ట్!
అయితే.. మిగిలిన ప్రేక్షకులతో పోలిస్తే.. తెలుగు ప్రేక్షకులు రుచి, అభిరుచి వేరన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టబు-విజయశాంతిలో ఎవరు బెస్ట్..? ఎవరి పాత్ర ఎలా ఉంది..? అని పోలికలు పెడుతున్నారు. అంతేకాదు.. పలు వెబ్ సైట్స్‌ ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌ అని పోల్స్ కూడా పెట్టడం గమనార్హం. ఫైనల్‌గా విజయశాంతికే తెలుగు ప్రేక్షకులు ఓటేశారు. వాస్తవానికి ఇద్దరూ ఇద్దరే.. ఎవర్నీ తీసేయడానికి లేదు.. ఎవర్నీ ఆకాశానికెత్తేయనక్కర్లేదు. ప్రస్తుతానికి రిలీజ్ అయిన రెండు సినిమాల ట్రైలర్స్‌లో విజయశాంతి, టబు ఎవరి పాత్రలో వారు జీవించేశారు. అంతా ఓకే.. ఇక సినిమాలో వారి వారి పాత్రలను బట్టి సినీ ప్రియులు ఎవరికి ఓటేసి గెలిపించి మరో సినిమాకు అవకాశం ఇస్తారో..? ఎవర్ని ఇంటికి పంపిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

చంద్రబాబూ.. మగాడివైతే రా తేల్చుకుందాం: పిన్నెల్లి

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

మరో సినిమాకు సిద్ధమవుతున్న బాలయ్య..?

నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మామూలుగా లేదు!. ఆయ‌న తోటి సీనియ‌ర్ హీరోలంద‌రూ ఒక సినిమా చేయ‌డానికి ముందు వెనుక ఆలోచిస్తుంటే బాల‌య్య మాత్రం ఏక‌ధాటిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి.. కుట్ర జరిగిందా!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని గత కొన్నిరోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

శ‌ర్వానంద్‌, స‌మంత చిత్రం 'జాను' .. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రానికి `జాను` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

'అల వైకుంఠ‌పుర‌ములో' మ్యూజిక‌ల్ ఫెస్టివల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో