Marburg Virus : ఆఫ్రికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్.. ఇప్పటి వరకు 9 మంది మృతి, లక్షణాలివే
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ల పాటు మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. దీంతో పరిస్ధితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్, ఆంక్షలు కొనసాగడంతో అన్ని దేశాలు ఆర్ధికంగా చితికిపోయాయి. కాగా.. ఆఫ్రికాలో ఓ ప్రాణాంతక వైరస్ వెలుగుచూసింది. మర్‌బర్గ్‌గా పిలుస్తున్న ఈ వైరస్ ఈక్వెటోరియల్ గినియాలో వ్యాప్తి చెందుతున్నట్లుగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. దీని బారినపడి ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న వెంటనే డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. వెంటనే వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వైద్య బృందాలను పంపడంతో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి సేవలను అందిస్తోంది.
ఇప్పటికే 9 మంది మృతి:
కాగా.. ఇటీవల గినియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎబోలోను పోలిన లక్షణాలతో కొందరు బాధపడుతున్నారు. దీంతో వైద్యులు వారి నమూనాలను సేకరించారు. వీటిని శెనెగల్ లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో పరీక్షించగా.. మార్‌బర్గ్ వైరస్‌గా తేలింది. ఈ వైరస్‌తో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 16 మందిలో ఈ లక్షణాలు వున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వైరస్ బారినపడిన వారిలో జ్వరం, అలసట, రక్తంతో కూడిన వాంతులతో బాధపడతారు.
వైరస్ ఇలా వ్యాపిస్తుంది:
ఇది కూడా గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తిస్తుందని నిపుణుల పరిశోధనలో తేలింది. వైరస్ సోకిన వ్యక్తులు, జంతువుల స్రావాలను తాకడం లేదా అవి తాకిన వస్తువులను ముట్టుకోవడం వైరస్ వ్యాప్తి చెందుతోంది. వైరస్ బారినపడిన 21 రోజుల్లో ఇది బయటపడుతుంది. మార్‌బర్గ్ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 88 శాతం వరకు వుంది. వైరస్ నివారణకు చికిత్స లేదు. లక్షణాలను బట్టి అందుబాటులో వున్న మందుల ద్వారా రోగిని రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout