Salaar:'సలార్' మూవీ తొలి టికెట్ కొనింది ఎవరంటే..?

  • IndiaGlitz, [Saturday,December 16 2023]

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 'సలార్' ఫీవరే కనిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్, సూరీడే పాట విడుదలయ్యాక మరింత క్రేజ్ నెలకొంది. సినిమా విడుదలకు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ షూరూ చేసింది. ఈ క్రమంలో మూవీ తొలి టికెట్‌ను రాజమౌళి కొనుగోలు చేశారు. 'సలార్' చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ సంస్థ అధినేత నవీన్ ఎర్నేని తొలి టికెట్‌ రాజమౌళికి అందజేశారు.

మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. మూవీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ బయటకు రావడం ఇదే మొదటిసారి. త్వరలోనే ఈ ఇంటర్వ్యూను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ ఛాన్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. తన కెరీర్‌లో బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ అని కొనియాడారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు చాల ఆతృతగా ఎదురుచూశానని తెలిపారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి మరొక ఇంటర్వ్యూ ప్లాన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్‌ నటిస్తున్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు. ‘సలార్‌’ చిత్రానికి ‘కేజీయఫ్‌’కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ వార్తల్లో నిజం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు విడుదలకు ముందే మూవీ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దీనిని దక్కించుకున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక విడుదల లోపు ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

More News

MP Galla Jayadev:టీడీపీకి భారీ షాక్.. పార్టీ వీడే యోచనలో ఎంపీ గల్లా జయదేవ్..?

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ పరిస్థితి దిగజారుతోంది. ఓవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సృష్టి్స్తుందని సర్వేలు చెబుతుంటే..

Bigg Boss Telugu 7 : ఫుడ్ పొగొట్టుకున్న యావర్ .. అమర్‌ సీక్రెట్ చెప్పిన అర్జున్, చెంప పగులగొట్టిన శివాజీ

బిగ్‌బాస్ తెలుగు 7 మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో నామినేషన్స్, గొడవలు లాంటివేవి లేవు. కంటెస్టెంట్స్‌

TDP-Janasena: జనసేనతో పొత్తు.. చంద్రబాబు కుటుంబంలో రచ్చ..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార, విపక్ష పార్టీలు కురుక్షేత్రానికి సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ మిగిలిన పార్టీల కంటే ముందుకు దూసుకుపోతోంది.

Kishan Reddy:తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తాం: కిషన్‌ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Ramgopal Varma:ఏపీ సీఎం ఎవరో తనకు తెలియదు: రామ్‌గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.