ఆ ఇద్దరిలో ఎవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి వంశం నుంచి మరో హీరో తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. సీనియర్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య కూడా ఈ ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని గతంలో చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. తన కొడుకు ఎంట్రీ కోసం బాలయ్య.. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ దర్శకుల పేర్లని పరిశీలించారని సమాచారం. అందులో ఒకరు బాలయ్య కెరీర్లో సింహా`, లెజెండ్` వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను కాగా...మరొకరు బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి`ని జనరంజకంగా తెరకెక్కించిన డైరెక్టర్ క్రిష్. వీరిలో ఎవరో ఒకరు మోక్షజ్ఞని డైరెక్ట్ చేసే అవకాశముందని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments