ఆ ఇద్దరిలో ఎవరితో?

  • IndiaGlitz, [Wednesday,March 14 2018]

డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌కు 'హ‌లో' సినిమా కాస్త బ్రేక్ వేసింది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అఖిల్ న‌టించిన 'హలో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర విజ‌యాన్ని అందుకోలేదు. ఇప్పుడు విక్ర‌మ్ కుమార్ ఏ హీరోతో సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో సినిమా రూపొంద‌నుంది.
అయితే ఈ సినిమాలో హీరోగా నాని లేదా శ‌ర్వానంద్ న‌టిస్తాడా? అనే దానిపై ఇంకా స‌మాచారం లేదు. ఎందుకంటే నాని ఇప్పుడు నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోతున్నాడు. అలాగే శ‌ర్వానంద్ హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా త‌ర్వాత సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వ‌లో సినిమా చేయబోతున్నాడు. వీరిద్ద‌రి క‌మిట్‌మెంట్స్ పూర్త‌య్యే వర‌కు విక్ర‌మ్ కుమార్ ఆగాల్సి వ‌స్తుంది మ‌రి. చివ‌ర‌కు ఏ హీరోతో సినిమా చేయ‌నున్నాడో మ‌రి...