close
Choose your channels

'రంగస్థలం' లో ఆ ఇద్దరు ఎవరై ఉంటారు?

Saturday, February 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేయసి ప్రేమను పొందడానికి ఆమెను పొగుడుతూ ప్రియుడు చాలా అందమైన పాటలు పాడుతూ ఉంటాడు. రంగస్థలం` సినిమా నుంచి అలాంటి పాటను ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. రామలక్ష్మి(సమంత) అందాన్ని చూసి చిట్టిబాబు(రామ్ చరణ్) పాడేసిన “ఎంత సక్కగున్నావే లచిమి” పాట ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది.

అయితే ఈ చిత్రం నుంచి త్వరలో రంగమ్మ, మంగమ్మ` అంటూ మరో పాటను చిట్టిబాబు పాడ‌బోతున్నాడు. త్వరలో ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలో రంగమ్మ, మంగమ్మ ఎవరై ఉంటారని మెగా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఇది ఐటెం సాంగ్ అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదిలా వుంటే...సినిమాలో ఈ పాటే ప్రత్యేక ఆకర్షణ నిలవనుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. మరి ఆ రంగమ్మ, మంగమ్మ` ఎవరో తెలియాలంటే విడుదల వరకు వేచి ఉండాల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment