రకుల్‌ను డ్రగ్స్ కేసు నుంచి కాపాడేందుకు యత్నిస్తున్న తెలంగాణ పెద్దలెవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోందో లేదో కానీ.. టాలీవుడ్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ రంగు పులుముకుని సంచలనంగా మారుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ కేసుకు సంబంధించిన శుక్రవారం ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే. నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో రకుల్ పలు కీలక విషయాలను వెల్లడించిందని టాక్ నడుస్తోంది. డ్రగ్స్ చాట్ చేశానని రకుల్ అంగీకరించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. అంతే కాదు.. తన నలుగురు స్నేహితులు డ్రగ్స్ తీసుకునేవారని.. పేర్లతో సహా వెల్లడించిందని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ కేసు టీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకుంటోంది.
అసలే డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటూ పీకల్లోతు కష్టంలో రకుల్ ఉంటే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ముంబై డ్రగ్స్ కేసుతో హైదరాబాద్‌కు లింకులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకుని విచారణకు హాజరైన రకుల్ ప్రీత్‌సింగ్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలే చేశారు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసును తొక్కేశారని సంపత్ ఆరోపించారు. ఆయన ఆరోపణలు చేశారు కానీ ఆ పెద్దల పేర్లను మాత్రం సంపత్ వెల్లడించలేదు.
ఇంతకీ ఎవరా పెద్దలు?
రకుల్ ప్రీత్ సింగ్‌ను కాపాడటానికి అంతగా ట్రై చేస్తున్న పెద్దలెవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రకుల్‌కు టీఆర్ఎస్కి చెందిన ఓ పెద్ద తలకాయతో రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సమయంలో సంపత్ చేసిన వ్యాఖ్యలు ఆ పుకార్లకు బలాన్నిస్తున్నాయి. అమ్మడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన తరుణంలో తిరిగి టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆ పెద్ద తలకాయే కారణమని.. అంతే కాదు.. ఆమె హైదరాబాద్‌లో ఓపెన్ చేసిన జిమ్ సెంటర్ వెనుక కూడా ఆ పెద్ద తలకాయ హస్తముందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికంతటికీ నేడు సంపత్ చేసిన వ్యాఖ్యలు బలాన్నిస్తున్నాయి.
సంపత్ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఎవరా పెద్ద తలకాయ అనే దానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. రకుల్‌ని డ్రగ్స్ కేసు నుంచి తప్పించేంత సాహసం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ఆరోపణలు ఇంతటితో ఆగుతాయో.. లేదంటే మరింత పెరుగుతాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com