Whistle Review
కోలీవుడ్ స్టార్ హీరోల్లో అభిమానుల ఆదరణ ఉండే వారిలో విజయ్ ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్ హీరోగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న విజయ్‌కి తెలుగులో మాత్రం గొప్ప మార్కెట్ లేదు. ఈ మధ్య ఆయన సినిమాలకు తెలుగులోనూ ఆదరణ దక్కుతుంది. ఇలాంటి తరుణంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `బిగిల్`. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేసింది. విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. తెలుగులో హయ్యస్ట్ స్క్రీన్స్‌లో విడుదలవుతున్న తొలి చిత్రం కూడా `విజిల్` కావడం గమనార్హం. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం.
కథ:
విశాఖ నగరంలోని రాజప్ప(విజయ్) తన వాడలోని పేద ప్రజలకు అండగా ఉండే ఓ పెద్ద మనిషి. శత్రువులు చేసే చెడ్డ పనుల నుండి తన వారిని కాపాడటానికి రాజప్ప కత్తి పడతాడు. దాంతో అందరూ తనని రౌడీ అంటుంటారు. అయితే తనలా తన వాడలోని పిల్లలు కాకూడదని వారిని చదువులో, ఆటల్లో ఎంకరేజ్ చేస్తుంటాడు. ఆ క్రమంలో రాజప్ప కొడుకు మైకేల్(విజయ్) ఫుట్‌బాల్ ఆటలో స్టేట్ లెవల్ ఆటగాడిగా మారతాడు. అతన్ని చూసి చాలా మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్‌గా రాణించాలనుకుంటుంటారు. నేషనల్ ప్లేయర్‌గా ఎన్నికై, ఢిల్లీ వెళుతున్న మైకేల్ కళ్ల ముందే అతని తండ్రిని దుండగులు చంపేస్తారు. దాంతో మైకేల్ ప్రత్యర్థుల్లో కొందరిని చంపేసి తన వారి కోసం ఆటను వదిలేసి అండగా నిలబడతాడు. ఐదేళ్ల తర్వాత మైకేల్ స్నేహితుడు లేడీ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా టీమ్‌ను నేషనల్ పోటీలకు తీసుకెళుతుంటాడు. ఆ క్రమంలో మైకేల్‌పై జరిగిన దాడిలో అతని స్నేహితుడు గాయపడతాడు. ఇక స్నేహితుడి కోసం మైకేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? లేడీ ఫుట్‌బాల్ టీమ్‌కు మైకేల్ ఎలాంటి గైడెన్స్ అందిస్తాడు? చివరకు మైకేల్ తన తండ్రి ఆశయాన్ని నేరవేర్చాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
విజయ్, అట్లీ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు తెరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది) సినిమాలు రూపొంది ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. భారీ అంచనాలతో భారీ బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, రౌడీ రాజప్ప పాత్రల్లో ఆకట్టుకున్నాడు. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ , రాజప్ప పాత్రలో తనదైన మాస్ యాక్టింగ్‌ను ప్రదర్శించాడు. ఇక మైకేల్ పాత్రలో లవర్‌బోయ్‌గా, ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఆకట్టుకున్నాడు. మూడు వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రల్లో విజయ్ మెప్పించాడు. ఇక నయనతార తనదైన నటనతో తన పాత్రకు న్యాయం చేసింది. వాడలో ఉండే అమ్మాయి స్లాంగ్‌లో నయన భాష డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇక జాకీష్రాఫ్ మెయిన్ విలన్‌గా స్టైలిష్‌గా నటించాడు. యోగిబాబు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన పాత్ర కాస్త ప్రేక్షకులను ఎంటరటైన్ చేస్తుంది. అనంత్‌రాజ్ పాత్ర సైడ్ క్యారెక్టర్‌లా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో మొదటి ముప్పై నిమిషాలు విజయ్ తరహా మాస్ కామెడీ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ కాదు. ఇబ్బందిగా అనిపిస్తుంది. రాజప్ప క్యారెక్టర్ ఎంట్రీ నుండి సినిమా అసలు కథలోకి ఎంట్రీ ఇస్తుంది. మురికివాడల్లో ఉండే యువకుల్లోనూ టాలెంట్ ఉంటుంది. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను అట్లీ తెరకెక్కించాడు. ఇక సెకండాఫ్‌లో విజయ్ లేడీ ఫుట్‌బాల్ టీమ్‌కు కోచ్‌గా మారడం.. వారు అతన్ని వ్యతిరేకించడం విజయ్ వారితో బెట్ కట్టి గెలిచే సన్నివేశాలు.. తర్వాత వాళ్లని మోటివేట్ చేసే సన్నివేశాలు.. ఇలా సినిమాలోని సన్నివేశాలు ఆసక్తికరంగా మారుతాయి. ఇక ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వెండితెరపై చూడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు సింప్లీ సూపర్బ్. మనకు తెలిసిన సన్నివేశాలతోనే సినిమాను ఆసక్తికరంగా మలచడంతో డైరెక్టర్ అట్లీ దిట్ట. ఈ సినిమాలోనూ అదే స్టైల్ ఆఫ్ టేకింగ్‌ను చూపించాడు. ఫుట్ బాల్ మ్యాచ్‌లకు ముందుండే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఫస్టాఫ్ అంతా మరీ హీరోయిక్‌గా నడిచే విజిల్.. సెకండాఫ్‌లో మహిళల ఫుట్‌బాల్ మీదనే సాగుతుంది. విష్ణు కెమెరా పనితనం బావుంది. ఎ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం.. సినిమాలో తమిళ వాసనలు ఉండటం.. ఫస్టాఫ్‌లోని మొదటి ముప్పై నిమిషాలు తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు
బోటమ్ లైన్: విజిల్.. మాస్ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా
Read 'Whistle' Movie Review in English
- Read in English