ఇద్దరు బాలీవుడ్ భామల్లో మహేశ్‌తో నటించేదెవరో?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మహేశ్‌కి కథ నచ్చకపోవడంతో ఆగిపోయింది. వంశీ పైడిపల్లి స్థానంలో పరుశురామ్ చేరాడని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. కొన్ని రోజుల ముందు ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వినపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేశ్ అండ్ టీమ్ బాలీవుడ్ హీరోయిన్‌ను నటింప చేయాలని అనుకుంటున్నారట.
వివరాల మేరకు ఈ సినిమాలో నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్స్‌ను నటింప చేయాలనుకుంటున్నారట. సారా అలీఖాన్, కియారా అద్వానీ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. కియారా ఇప్పటకే మహేశ్‌తో భరత్ అనే నేను చిత్రంలో నటించింది. మరి ఈ ఇద్దరిలో ఎవరితో అయినా మహేశ్ నటిస్తాడా? లేక మరో హీరోయిన్‌ను తీసుకుంటారా? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమర్మ్‌లో ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. ఇదే రోజున 14 ఏళ్ల క్రితం అంటే 2006లో మహేశ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, మహేశ్‌ని సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన పోకిరి చిత్రం విడుదలైంది. అదే రోజున తన 27వ సినిమాను మహేశ్ విడుదల చేయాలనుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments