Budget 2023 : పసిడి మరింత ప్రియం.. సెల్‌ఫోన్లు చవక.. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి
Send us your feedback to audioarticles@vaarta.com
2023- 24 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనగానే సామాన్యులు వేటిపై ధరలు పెంచుతారు.. వేటిపై తగ్గిస్తారు అనే విషయంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఎప్పటిలాగే ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా.. మరికొన్నింటిపై పన్ను భారం వేసింది. మరి దీని ఆధారంగా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏవి తగ్గుతాయో చూస్తే:
ధరలు పెరిగేవి:
బంగారం, వెండి ప్లాటినంతో తయారు చేసే వస్తువులు
సిగరెట్లు, టైర్లు
దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
రాగి వస్తువులు
ధరలు తగ్గేవి :
మొబైల్స్, ల్యాప్‌టాప్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు
టీవీ ప్యానెల్ విడి భాగాలు
లిథియం అయాన్ బ్యాటరీలు
ఎలక్ట్రిక్ వాహనాలు
వజ్రాల తయారీకి ఉపయోగించే వస్తువులు
డీఎస్ఎల్ఎర్ కెమెరా లెన్స్‌లు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout