శ్రీమంతుడు అర్ధశతదినోత్సవం ఎక్కడ...?

  • IndiaGlitz, [Sunday,September 06 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందిన శ్రీమంతుడు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఒన్ నేనొక్క‌డినే, ఆగ‌డు...చిత్రాలు నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే హిట్ కొట్టాల‌ని క‌సితో చేసిన శ్రీమంతుడు సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు మ‌హేష్. ముఖ్యంగా శ్రీమంతుడు దాదాపు 100 కోట్లు షేర్ సాధించి బాహుబ‌లి త‌ర్వాత స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డం విశేషం.

యు.ఎస్ లో మ‌హేష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. అక్క‌డ శ్రీమంతుడు రికార్డు స్థాయిలో త్రీ మిలియ‌న్స్ వ‌సూలు చేసింది. ఇక అస‌లు విష‌యానికివ వ‌స్తే .. శ్రీమంతుడు అర్ధ‌శ‌త‌దినోత్స‌వంను యు.ఎస్ లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. పైగా శ్రీమంతుడు నిర్మాత‌లు కూడా ఎన్నారైలే. అందుచేత యు.ఎస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా శ్రీమంతుడు 50 డేస్ ఫంక్ష‌న్ యు.ఎస్ లోనే గ్రాండ్ గా చేయ‌నున్నార‌ట‌.