ఈ నియోజకవర్గంలో పవన్ గెలుపు పక్కా..!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి గాజువాక కాగా.. మరొకటి భీమవరం. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ ఎక్కడ్నుంచి గెలవబోతున్నారు..? రెండు స్థానాల్లో గెలుస్తారా..? ఒక స్థానానికి పవన్ పరిమితమవుతారా..? ఇలా పవన్‌పై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పవన్ ఏ అసెంబ్లీ నుంచి గెలవబోతున్నాడో తేలిపోయింది.!
భీమవరం విషయానికొస్తే...
పవన్ భీమవరంలో ఓడిపోతాడని కోట్లలో పందేలకు దిగుతున్నారట. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువయినప్పటికీ.. జనసేనాని ఓడిపోతాడని బెట్టింగ్ రాయుళ్లు బలంగా నమ్ముతున్నారట. జనసేనాని గెలిస్తే.. మీకు లక్ష రూపాయలు ఇస్తామని.. ఓడితే రూ.3 లక్షలు ఇవ్వండని బెట్టింగులకు దిగుతున్నారట. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి.. లోకల్ హీరోగా పేరుగాంచిన గ్రంథి శ్రీనివాస్ బలంగా ఉండటమే ఇందుకు కారణమట. కాగా టీడీపీ అభ్యర్థిని జనాలు ఈసారి పెద్దగా ఆదరించే పరిస్థితిలో లేరని టాక్ నడుస్తోంది. సో భీమవరం పక్కాగా వైసీపీ ఖాతాలోకే అని ఇప్పటికే పలు సర్వేలల్లో నిగ్గు తేలిందని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయట.
గాజువాక విషయానికొస్తే...
గాజువాకలో మాత్రం పరిస్థితి భీమవరంకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇక్కడ జనసేనకు కార్యకర్తలు, మెగాభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు కొన్ని లక్షలమంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు కూడా. దీంతో ఇక్కడ పక్కాగా గెలుస్తానని ధీమాతో ఎంచుకున్నారట. అయితే గాజువాకలో పవన్‌కు అనుకూలంగా బెట్టింగులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతే రూ.5 లక్షలు ఇస్తాం.. గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తారా? అని బెట్టింగులు కడుతున్నారట. పైగా పవన్ కొద్దిరోజుల క్రితం స్వీకరించిన రెల్లి కులస్థులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇక్కడ కూడా జనసేనకు వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో జనసేన అభిమానులు, మెగాభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారట.
మొత్తానికి చూస్తే భీమవరం కంటే గాజువాకలోనే పవన్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలిపోయింది. ఇటీవల చేసిన సర్వేలు సైతం గాజువాకలోనే పవన్ గెలిచే అవకాశం ఉందని తేల్చాయట. అందుకే ఎక్కువగా పవన్.. గాజువాకపైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. సో ఇందులో నిజానిజాలేంటి..? అసలు పవన్ ఎక్కడ్నంచి గెలవబోతున్నారు..? ఎక్కడ్నుంచి ఓడిపోబోతున్నారు..? అనేది తెలియాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments